Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య
Lawyer Suicide | దసరా పండుగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఓ యువ న్యాయవాది( Lawyer Suicide ) ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
Lawyer Suicide | త్రినేత్ర న్యూస్ : దసరా పండుగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఓ యువ న్యాయవాది( Lawyer Suicide ) ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంకు చెందిన తొలుపునూరి గణేశ్(27) ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే తన అన్న సాయితేజతో కలిసి సోమవారం రాత్రి ముదిగొండ మండలంలోని పెద్దమండవలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అయితే సాయితేజ తన అమ్మమ్మతో కలిసి మంగళవారం గుడికి వెళ్లారు.
వారిద్దరూ గుడికి వెళ్లొచ్చేసరికి గణేశ్.. అమ్మమ్మ ఇంట్లో సీలింగ్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. యువ న్యాయవాది ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. గత నాలుగు రోజులుగా తనను ఎవరో వెంబడిస్తున్నారని గణేశ్ చెప్పినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్లు కూడా చేసి తనని బెదిరించినట్లు గణేశ్ ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. మార్పు కోసం అమ్మమ్మ ఇంటికి పంపిస్తే.. ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు.
తాజావార్తలు
- ●Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!
- ●Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!
- ●Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?
- ●Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం.. 11-11-11:11 ముహూర్తాన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!
- ●Yellamma Movie | ప్రభాస్ 'స్పిరిట్' ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’

Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..

అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!

Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!

Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?





