Macbook Air 2025 | మాక్‌బుక్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు ధరకు సేల్..
Technology | Published On Dec 16, 2025, 10.57 am IST
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన మాక్‌బుక్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాక్‌బుక్ ఎయిర్ (2025) మోడల్‌పై యాపిల్ ఏకంగా రూ.10వేల తగ్గింపు ధరను అందిస్తోంది. కనుక మాక్‌బుక్ కొనాలని చూస్తున్నవారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. యాపిల్ తన లేటెస్ట్ మాక్ బుక్ ఎయిర్ (2025) మోడల్‌ను ఎం4 ప్రాసెసర్‌తో ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ మోడల్‌పై ఏకంగా రూ.10వేల తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఇక ఈ మాక్‌బుక్ 3 కలర్ ఆప్షన్లలో, రెండు డిస్‌ప్లే సైజుల్లో వినియోగదారులకు లభిస్తోంది.
Macbook Air 2025 | మాక్ బుక్ ఎయిర్ (2025) ల్యాప్ టాప్‌ను అమెజాన్‌లో తగ్గింపు ధరకు అందిస్తున్నారు. కనుక ఆ సైట్‌లోనే దీన్ని వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మాక్ బుక్ ఎయిర్ (2025) 13 ఇంచ్ డిస్‌ప్లే, 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ లాంచింగ్ ధర రూ.99,900 ఉండగా, ప్రస్తుతం దీన్ని డిస్కౌంట్ పోను రూ.90,900 ధరకు అందిస్తున్నారు. అయితే కేవలం ఈ వేరియెంట్‌పైనే అది కూడా స్టార్ లైట్ కలర్ ఆప్షన్ మోడల్ పైనే ఈ తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఇతర మోడల్స్ పై కూడా తగ్గింపు ధర లభిస్తుంది. కానీ కాస్త తక్కువ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. స్కై బ్లూ, సిల్వర్, మిడ్ నైట్ కలర్ ఆప్షన్ మోడల్స్‌ను కాస్త తగ్గింపు ధరతో రూ.92,900, రూ.94,900, రూ.92,900 ధరలకు పొందవచ్చు.
ఇక మాక్ బుక్ ఎయిర్ (2025) 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ లాంచింగ్ ధర రూ.1,19,900 ఉండగా ఈ ప్రస్తుతం దీన్ని రూ.8వేల తగ్గింపు ధరతో రూ.1,11,900కు అందిస్తున్నారు. ఇక ఈ మోడల్స్‌ను ఎస్‌బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో మాక్‌బుక్ ధర మరింత తగ్గుతుంది.
ఇక మాక్ బుక్ ఎయిర్ (2025) మోడల్‌లో యాపిల్ ఎం4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా, ఇందులో 10 కోర్ ప్రాసెసర్, 16 కోర్ న్యూరాల్ ఇంజిన్, 8 కోర్ జీపీయూ ఉంది. ఈ మోడల్ 13 ఇంచ్ డిస్‌ప్లే సూపర్ రెటినా టెక్నాలజీని కలిగి ఉంటుంది. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్ లభిస్తుంది. అలాగే 6కె రిజల్యూషన్ ఉన్న రెండు ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలను దీనికి కనెక్ట్ చేయవచ్చు. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, రెండు యూఎస్‌బీ 4 పోర్టులు, మాగ్‌సేఫ్ 3 చార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, టచ్ ఐడీ, 53.8 వాట్ అవర్ బ్యాటరీ, 70 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను ఈ మాక్‌బుక్‌లో అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

Perplexity Computer | పెర్ప్లెక్సిటీ ఏఐ కంప్యూటర్ వచ్చేసింది.. ఐఫోన్ ఉంటే చాలు.. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు..
మే 9, 2026

iPhone 17 | మదర్ప్ డే సందర్భంగా యాపిల్ సేల్.. ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు..
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



