Facebook | ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..
Facebook | అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు వెల్లడించాయి. సేవల్లో అంతరాయాలను వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసే డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ ఈ వివరాలను వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:51 గంటల సమయంలో ఫేస్‌బుక్‌కు సంబంధించి 17,667 సమస్యల ఫిర్యాదులు నమోదయ్యాయి.
Technology | Published On Sep 21, 2026, 2.12 pm IST
Facebook | అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు వెల్లడించాయి. సేవల్లో అంతరాయాలను వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసే డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ ఈ వివరాలను వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:51 గంటల సమయంలో ఫేస్‌బుక్‌కు సంబంధించి 17,667 సమస్యల ఫిర్యాదులు నమోదయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఫేస్‌బుక్‌కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య 15గా ఉంటుందని డౌన్‌డిటెక్టర్ పేర్కొంది. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌కు 5,653 ఫిర్యాదులు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ సాధారణ స్థాయి ఫిర్యాదులు 21గా ఉన్నాయి.
మెసెంజర్, వాట్సాప్‌లలోనూ..
మెటాకు చెందిన మరో సేవ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కూడా అంతరాయం కనిపించింది. ఉదయం 6:52 గంటల సమయంలో మెసెంజర్‌కు సంబంధించి 172 ఘటనలు నమోదయ్యాయి. సాధారణంగా నమోదయ్యే నాలుగు ఫిర్యాదులతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. మెటాకు చెందిన వాట్సాప్‌కు కూడా కొన్ని సమస్యల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉదయం 6:51 గంటల సమయంలో వాట్సాప్‌కు 23 ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా నమోదయ్యే ఫిర్యాదుల సంఖ్య రెండు మాత్రమే.
అమెరికాకే పరిమితం..?
అయితే డౌన్‌డిటెక్టర్‌లో కనిపించే సంఖ్యలు వినియోగదారులు స్వయంగా సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా ఉంటాయి. అందువల్ల వాస్తవంగా ఎంతమంది వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ప్రభావితమయ్యారో ఈ గణాంకాలు కచ్చితంగా సూచించవు. కానీ ఆయా సేవలకు మాత్రం అంతరాయం ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అయితే దీనిపై మెటా ఇంకా స్పందించలేదు. కేవలం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలకు అంతరాయం ఏర్పడగా, ఇతర దేశాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని తెలిసింది.
సంబంధిత వార్తలు

Meta | చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం.. అక్రమ కంటెంట్‌పై పోలీసులకు సమాచారం..
సెప్టెంబర్ 15, 2026

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ట్యాగ్ చేసిన పోస్టులూ ప్రొఫైల్‌లోనే..
సెప్టెంబర్ 12, 2026

Obscene Content | టీచర్లు, విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు అసభ్యంగా మార్ఫింగ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
- ●Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!
- ●Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
- ●Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Kasaragod Road Accident | రోడ్డుపై భయానక ప్రమాదం: జీప్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్
- ●FASTag | ఫాస్టాగ్‌లో కీలక మార్పు.. ట్యాగ్ మార్చకుండానే బ్యాంక్‌ను మార్చుకోవచ్చు..

Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి

Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!

Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు

Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్



