Hyundai Car Discounts | కార్లను కొనేవారికి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్లను ప్రకటించిన హ్యుందాయ్..
Hyundai Car Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన పలు మోడల్ కార్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు హ్యుందాయ్ తెలిపింది.
Technology | Published On Apr 6, 2026, 11.05 am IST
Hyundai Car Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన పలు మోడల్ కార్లను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, క్రెటా, వెర్నా, అల్కజార్ వంటి పలు కార్ మోడల్స్‌పై గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్‌తోపాటు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, అప్‌గ్రేడ్ స్కీమ్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్, గ్రామీణ ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం కార్లను కొనాలనుకునే వారికి ఇది చక్కని అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు.
వెర్నా మోడల్‌పై గరిష్ట డిస్కౌంట్..
హ్యుందాయ్ కి చెందిన వెర్నా మోడల్ కారుపై ఏకంగా రూ.1.10 లక్షల వరకు బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. క్రెటా ఎలక్ట్రిక్‌పై రూ.1 లక్ష మేర ప్రయోజనాలను పొందవచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.68వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో 83పీఎస్ శక్తిని ఇది ఇస్తుంది. 113.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉన్న ఈ కారు ఆ వేరియెంట్‌లో 69 పీఎస్ శక్తిని అందిస్తుంది. సిటీల్లో ప్రయాణాలకు అనువైన హ్యాచ్ బ్యాక్ మోడల్‌గా ఇది పేరుగాంచింది. హ్యుందాయ్ ఆరాపై వినియోగదారులు రూ.20వేల వరకు బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది.
పాత స్టాక్‌కు అధికంగా రాయితీ..
హ్యుందాయ్ ఐ20పై రూ.58వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తోపాటు ఎన్ లైన్ వేరియెంట్లలో 1.0 లీటర్ టర్బో ఇంజిన్ 120 పీఎస్ శక్తిని ఇస్తుంది. అలాగే స్పోర్ట్జ్, ఆస్టా వేరియెంట్లలో ఈ డిస్కౌంట్ వల్ల ధరల వ్యత్యాసం తగ్గుతోంది. ఇక హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై పాత స్టాక్‌కు రూ.43వేల వరకు డిస్కౌంట్ ఇస్తుండగా, కొత్త స్టాక్‌పై రూ.5వేల వరకు మాత్రమే రాయితీ ఇస్తున్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లో ఇతర బ్రాండ్ కార్లకు పోటీగా నిలుస్తోంది. హ్యుందాయ్ వెన్యూ కార్‌పై రూ.5వేలు డిస్కౌంట్ ఇస్తుండగా, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు ఉన్నాయి.
హ్యుందాయ్ అల్కజార్‌పై..
హ్యుందాయ్ క్రెటా సాధారణ మోడల్‌పై రూ.55వేల వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఇందులో 1.5 పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్ అల్కజార్ పెట్రోల్ మోడల్స్‌పై రూ.70వేలు, డీజిల్ వేరియెంట్లపై రూ.30వేల వరకు రాయితీలను ఇస్తున్నారు. హ్యుందాయ్ ప్రకటించిన ఆఫర్లు వినియోగదారులకు ఆకర్షణీయంగా మారాయని, ఇప్పుడు ఆయా కార్లను కొనుగోలు చేస్తే చాలా వరకు డబ్బు ఆదా చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వినియోగదారులు కార్‌ను కొనే ముందు పూర్తి వివరాలు, ఆఫర్ల గురించి మళ్లీ ఒకసారి తెలుసుకుంటే మంచిది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Un Employees | నవంబర్ 7న మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు
- ●MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి
- ●Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...
- ●Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..
- ●Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
- ●Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Un Employees | నవంబర్ 7న మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు

MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి

Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...

Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..






