PV Sindhu | పీవీ సింధు సరికొత్త చరిత్ర.. జపాన్ ఓపెన్ గెలుపొందిన భారత షట్లర్‌గా రికార్డ్..
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ (Japan Open) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ అనకానె యమగూచి (Akane Yamaguchi)పై 21-17, 21-17తో రెండు వరుస సెట్లలో విజయం సాధించింది.
PV Sindhu | త్రినేత్ర.న్యూస్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ (Japan Open) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ అనకానె యమగూచి (Akane Yamaguchi)పై 21-17, 21-17తో రెండు వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుపొందిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. గత 19 నెలలుగా ఫామ్ లేమితో బాధపడుతున్న సింధుకు ఇదే తొలి టైటిల్. సింధు చివరిసారిగా గెలిచింది కూడా యమగూచిపైనే కావడం విశేషం. 2020లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో యమగూచిపై విజయం సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా ఓపెన్‌లో వీరిద్దరూ తలపడ్డారు. అయితే గాయం కారణంగా ఆమె తప్పుకున్నది.

తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు ఆడారు. అయితే చివర్లో పుంజుకున్న సింధు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్‌లో ఆధ్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. విజయం సాధించింది.
PV Sindhu Is The Champion Of The Japan Open 2026 ❤️🏆
This Is Sindhu's 1st S750 Title And Her 1st World Tour Title Since The 2024 Syed Modi International .
Sindhu Will Enter The Top 8 In The World Rankings Next Week .#JapanOpen2026 https://t.co/3ujCCQggQP pic.twitter.com/7evCCTdnJx
— Badminton Media (@BadmintonMedia1) July 19, 2026
సంబంధిత వార్తలు

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
జులై 17, 2026

PV Sindhu Temple Device | పీవీ సింధుకు ఏమైంది.. ఉబెర్ కప్‌లో నొసటిపై పెట్టుకున్న ఆ పరికరం ఏంటి?
ఏప్రిల్ 25, 2026

PV Sindhu | దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు.. భయానకంగా ఉందన్న బ్యాడ్మింటన్ స్టార్
మార్చి 1, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..

Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా



