IND vs END T20 | చేతులెత్తేసిన బ్యాటర్లు.. మూడో టీ20లో భారత్‌కు ఘోర పరాభవం
IND vs END T20 | ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా (IND vs END T20) చిత్తుగా ఓడిపోయింది. నాటింఘమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో భారత్‌కు పరాభవం తప్పలేదు.
IND vs END T20 | త్రినేత్ర.న్యూస్: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా (IND vs END T20) చిత్తుగా ఓడిపోయింది. నాటింఘమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో భారత్‌కు పరాభవం తప్పలేదు. దీంతో సిరీస్‌లో 2-0తో వెనకబడిపోయింది. తొలి టీ20 వర్షంతో రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 70, శ్యామ్ కరన్ 41 పరుగులతో రాణించారు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడటంతో 11.4 ఓవర్లలో 76 రన్స్‌కే కుప్పకూలింది. గత ఏడేండ్లలో భారత్ ఇంత భారీతేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. 2019లో న్యూజిలాండ్‌పై (New Zealand) టీ20లో 80 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం.
ఇంగ్లండ్ బ్యాటింగ్..
సాల్ట్ (సి) అర్ష్‌దీప్ (బి) అక్షర్ 70; బట్లర్ (బి) ప్రిన్స్ యాదవ్ 36; బ్రూక్ (సి) అభిషేక్ (బి) ప్రిన్స్ యాదవ్ 16; బెతెల్ (సి) సూర్యవంశీ (బి) హర్షిత్ 13; బాంటన్ (సి) వరుణ్ (బి) హర్షిత్ 0; సామ్ కరన్ నాటౌట్ 41; జాక్స్ రనౌట్ 14; ఆర్చర్ రనౌట్ 5; డాసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201.
వికెట్ల పతనం: 1-43, 2-71, 3-111, 4-111, 5-158, 6-193, 7-199.
బౌలింగ్: అర్ష్‌దీప్ 4-1-36-0; హర్షిత్ 4-0-40-2; అక్షర్ 4-0-49-1; ప్రిన్స్ యాదవ్ 4-0-30-2; శివమ్ దూబె 1-0-10-0; వరుణ్ 3-0-35-0

భారత్ బ్యాటింగ్..
అభిషేక్ (సి) సాల్ట్ (బి) టంగ్ 10; వైభవ్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 13; ఇషాన్ (సి) బెతెల్ (బి) టంగ్ 13; శ్రేయస్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 5; అక్షర్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 10; తిలక్ (స్టంప్డ్) బట్లర్ (బి) జాక్స్ 3; హర్షిత్ (సి) బాంటన్ (బి) టంగ్ 9; దూబె (సి) బట్లర్ (బి) టంగ్ 2; అర్ష్‌దీప్ (సి) బట్లర్ (బి) రషీద్ 4; వరుణ్ (బి) రషీద్ 5; ప్రిన్స్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (11.4 ఓవర్లలో ఆలౌట్) 76.
వికెట్ల పతనం: 1-23, 2-29, 3-41, 4-41, 5-52, 6-60, 7-63, 8-68, 9-70.
బౌలింగ్: ఆర్చర్ 3-0-29-3; టంగ్ 4-0-28-4; జాక్స్ 2-0-5-1; రషీద్ 2.4-0-14-2
England win the 3rd T20I by 125 runs to lead the series 2-0.
Scorecard ▶️ https://t.co/jan4S8zsaV#TeamIndia | #ENGvIND pic.twitter.com/JKung77cru
— BCCI (@BCCI) July 7, 2026
సంబంధిత వార్తలు

PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం
జులై 10, 2026

Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?
జులై 7, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



