Arjun Tendulkar | అర్జున్ టెండూల్కర్ కంటే అతడి భార్య సానియా ఎన్నేళ్లు పెద్దదంటే?
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం గురువారం ప్రియురాలు సానియా ఛందోక్‌తో జరిగింది. తండ్రి సచిన్ లాగే తనయుడు అర్జున్ కూడా తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అర్జున్ కంటే సానియా ఎన్నేళ్లు పెద్దదంటే?
Arjun Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం గురువారం జరిగింది. ప్రియురాలు సానియా ఛందోక్‌తో కలిసి ఏడడుగులు వేశాడు. గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు టీమిండియా క్రికెటర్లు పాల్గొన్నారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
తండ్రిలానే...
అర్జున్ టెండూల్కర్‌ది ప్రేమ వివాహం. అచ్చం తండ్రిలానే తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయితో ప్రేమలో పడిన అర్జున్...ఆమెను పెళ్లిచేసుకున్నాడు. సచిన్, అంజలి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఆరేళ్లకుపైనే ఉంటుంది. సచిన్, అంజలి లానే... అర్జున్ కంటే అతడి భార్య సానియా ఛందోక్ కూడా పెద్దదే. అర్జున్ 1999లో జన్మించగా.. సానియా 1998లో పుట్టింది. భార్య కంటే అర్జున్ ఏడాది చిన్నవాడు కావడం గమనార్హం.
సారాకు క్లోజ్ ఫ్రెండ్...
అర్జున్ సోదరి సారా టెండూల్కర్, సానియా క్లోజ్ ఫ్రెండ్స్. సారాను కలవడానికి సానియా తరచుగా టెండూల్కర్ ఇంటికి వచ్చేదట. ఆ టైమ్‌లోనే సానియాతో అర్జున్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ లవ్‌స్టోరీని తల్లిదండ్రులకు కూడా తెలియకుండా అర్జున్ జాగ్రత్తపడ్డాడట. కొడుకు లవ్‌స్టోరీ తెలిసి సచిన్ కూడా సర్‌ప్రైజ్ అయ్యాడట.
రిచ్ ఫ్యామిలీ...
సానియా ఛందోక్ గట్టి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా పెద్దదే. సానియా తాతయ్య రవి ఘాయ్ ముంబైలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా కొనసాగుతోన్నారు. గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగుతోన్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ వెయ్యి కోట్లపైనే ఉంటుందని సమాచారం. ఐస్‌క్రీమ్ బ్రాండ్స్ బాస్కిన్ రాబిన్స్, క్వాలిటీ సానియా కుటుంబానికి చెందినవే. ఇంటర్ కాంటినెంటల్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు హోటల్లు, రెస్టారెంట్‌లు ఉన్నాయి.
ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ దేశవాళీలో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ టోర్నీలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో 30 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు
- ●Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
- ●Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు

Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం

Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన






