బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు హూందాగా ప్రవర్తించాలి. బాధ్యతాయుతంగా మెలగాలి. వారి జీవితం మిగతావారందరికీ ఆదర్శం కావాలి. అంతేకాని పదిమంది వేలెత్తి చూపి నిందించే విధంగా ఉండకూడదు. ఇదంతా ఎందుకంటారా? మరేం లేదు. ఎమ్మెల్సీ కవిత కారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సార్లు నియమిత వేగ నిబంధనలను ఉల్లంఘించింది. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 15వేల రూపాయల చలాన్లు పెండింగులో ఉన్నాయి. అతివేగం ..కేవలం అందులో ప్రయాణిస్తున్న వారికే కాదు.. అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న వారికీ ప్రమాదకరమని తెలిసినా .. అంత ఓవర్ స్పీడులో ప్రయాణించాల్సిన అవసరమేముందో వారికే తెలియాలి.