Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
Amit Shah | మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా (Naxalism free India) అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. అదే స్ఫూర్తితో డిసెంబర్ 2029 నాటికి భారతదేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహిత దేశంగా (drug free India) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Amit Shah | త్రినేత్ర న్యూస్ : దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది త్యాగ ఫలితమే దేశంలో నక్సలిజం నిర్మూలనకు పునాది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక స్థూపం (National Police Memorial) వద్ద నిర్వహించిన జాతీయ పోలీసు స్మారక దినోత్సవం (Police Commemoration Day) పరేడ్‌లో ఆయన పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా (Naxalism free India) అంతమైందని ప్రకటించారు. అదే స్ఫూర్తితో డిసెంబర్ 2029 నాటికి భారతదేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహిత దేశంగా (drug free India) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
నక్సలిజం అంతమైంది..
మార్చి 31 నాటికి మన దేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందిందని షా వెల్లడించారు. 2026 పోలీసులకు ఎంతో కీలకమైన సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. దశాబ్దాల నాటి ఈ పీడకలకు ముగింపు పలకడంలో ఈ సంవత్సరం భారత పోలీసు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 1981 నుంచి 2026 మార్చి వరకు నక్సలిజం వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలో 3,600 మందికి పైగా భద్రతా సిబ్బంది, దాదాపు 13,700 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకున్నారు. అమరుల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశం ఈరోజు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందంటే దానికి ఈ 3,600 మంది వీరుల త్యాగమే పునాది అని అన్నారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ ఘన విజయం
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాల కారణంగా.. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని అమిత్ షా తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ పెద్ద ఎత్తున విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాద, తిరుగుబాటు గ్రూపులకు చెందిన వేలాది మంది సాయుధులు ఆయుధాలు వీడటంతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొందని పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), కోబ్రా బెటాలియన్ల కృషితో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సల్ సమస్య పూర్తిగా సమసిపోయిందని ప్రకటించారు.
సీఏపీఎఫ్ సిబ్బంది సేవలు అభినందనీయం..
ఈ సందర్భంగా సీఏపీఎఫ్ సిబ్బంది సేవలను షా ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు, పండుగలు, ఆందోళనలు.. ఇలా అన్ని వేళలా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు దేశ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. భద్రతా సిబ్బంది, వారి కుటుంబాల త్యాగాల వల్లే నేడు దేశం సురక్షితంగా ఉంటూ, ఆర్థికంగా, అంతర్జాతీయంగా వేగవంతమైన వృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దేశ సరిహద్దులను రక్షించడానికి పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించకపోతే దేశం నేడు ఏ స్థితిలో ఉండేదో ఊహించలేమన్నారు. దశాబ్దాలుగా కొనసాగిన నక్సలిజం సమస్యను అధిగమించి దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలు పునాది వేశాయని అమిత్ షా అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిబ్బందికి నివాళులర్పిస్తూ.. వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం
దేశంలో యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2029 డిసెంబర్ 31 నాటికి భారత్‌ను మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్ల పాటు ఉమ్మడిగా పోరాడి మాదకద్రవ్యాల మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డ్రగ్స్ సమస్య మన భావితరాల భవిష్యత్తును నాశనం చేయడమేకాకుండా.. ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతోందన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం కూడా ఈ డ్రగ్స్ దందా నుంచే జరుగుతోందన్నారు.
Also Read..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్
అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ
అక్టోబర్ 21, 2026

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్
అక్టోబర్ 16, 2026

Amit Shah | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆందోళనకరం : అమిత్ షా
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ
- ●Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..
- ●Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
- ●Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●TTD Recommendation Letters Cancelled | తిరుమల వెళ్తున్నారా? ఆ లేఖలు చెల్లవు.. టీటీడీ కీలక ప్రకటన
- ●Bhagwant Mann | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్

Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ

Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..

Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..



