త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జ‌ర్న‌లిస్టుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తరా?

RS Praveen Kumar | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల‌న‌లో పోలీసులే నేరాలు చేస్తున్నార‌ని.. భూ త‌గాదాల్లో వారి జోక్యం ఎక్కువైంద‌ని క‌థ‌నం రాసిన పాపానికి ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌(Journalists) ను చంపినంత ప‌ని చేశార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 19, 2026, 2.06 pm IST

RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జ‌ర్న‌లిస్టుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తరా?
Advertisement
  • వారిని టార్చ‌ర్ చేసి చంపినంత ప‌ని చేశారు
  • ఆ బాధితుల‌ను ఈరోజు క‌రీంన‌గ‌ర్‌లో క‌లిశాను
  • క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కాలేదు
  • బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ మండిపాటు

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల‌న‌లో పోలీసులే నేరాలు చేస్తున్నార‌ని.. భూ త‌గాదాల్లో వారి జోక్యం ఎక్కువైంద‌ని క‌థ‌నం రాసిన పాపానికి ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌(Journalists) ను చంపినంత ప‌ని చేశార‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ (RS Praveen Kumar) మండిప‌డ్డారు. క‌ర్ల రాజేశ్‌ను చంపిన విధంగానే శేఖర్, సంపత్‌ను చంపే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. గంభీరావుపేట పోలీసుల‌పై వెంట‌నే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి.. సీఐడీ (CID) విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఈమేర‌కు సోమ‌వారం బాధితుల‌ను క‌రీంన‌గ‌ర్‌లో క‌లిసిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా డీజీపీ గారు?

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసులు ఏక్ ధమ్ న్యూస్ పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై (అందులో ఒకరు ఎస్సీ సామాజిక వర్గం, మరొకరు బీసీ) అక్రమ కేసులు నమోదు చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా టార్చర్ చేశారు. భూ తగాదాల్లో పోలీసుల‌ జ్యోక్యంపై కథనం రాసిన పాపానికి పోలీసులు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. జర్నలిస్టులు ఈ దాడి గురించి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలేదు. డీజీపీ గారు.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే?

బాధితుల‌కు న్యాయం జ‌ర‌గాల్సిందే

బీఆర్ఎస్ నాయకులను మాత్రం ఏ నేరం చేయనోళ్ల మీద సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారు. ఇక్కడ చెయ్యి విరిగి, కాలికి గాయాలై తీవ్ర భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయరా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాధితులకు న్యాయం జరిగేదాక పోరాడుతం అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement