NTPC Recruitment | బీఈ, బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎన్టీపీసీలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
NTPC Recruitment | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) బీఈ, బీటెక్ అభ్యర్థులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NTPC Recruitment) విడుదల చేసింది.
NTPC Recruitment | త్రినేత్ర.న్యూస్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) బీఈ, బీటెక్ అభ్యర్థులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NTPC Recruitment) విడుదల చేసింది. దీనిద్వారా 250 ఖాళీలను భర్తీ చేస్తున్నది. బీఈ లేదా బీటెక్‌లో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారిని ప్రాధాన్యం ఉంటుంది. మే 7వ తేదీలోపు https://www.ntpc.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి ప్రతినెల రూ.55 వేలు జీతం అందుకోవచ్చు. అలవెన్సులు అదనంగా ఇస్తారు.
మొత్తం పోస్టులు- 250
ఇందులో జనరల్ 109, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 39, ఎస్సీ 42, ఎస్టీ 35 చొప్పున కేటాయించారు.
అర్హతలు
అభ్యర్థులు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 40 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా పవర్‌ప్లాంట్‌లో ఆపరేషన్స్ లేదా మెయింటెనెన్స్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. మే 7 నాటికి 35 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం
షార్ట్‌లిస్టింగ్ లేదా స్ట్రీనింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 7
వెబ్‌సైట్: https://careers.ntpc.co.in.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..





