Harish Rana | హరీశ్ రాణా అంత్యక్రియలు పూర్తి
Harish Rana | కారుణ్య మరణం (passive euthanasia) పొందిన 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని గ్రీన్ పార్క్ శ్మశానవాటిక (Green Park Cremation)లో హరీశ్ రాణా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
Harish Rana | కారుణ్య మరణం (passive euthanasia) పొందిన 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని గ్రీన్ పార్క్ శ్మశానవాటిక (Green Park Cremation)లో హరీశ్ రాణా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా తన కుమారుడికి తల్లిదండ్రులు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో బ్రహ్మకుమారిలు కూడా పాల్గొన్నారు.
ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల హరీశ్ రాణా.. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో, 2013 ఆగస్టు 20న ప్రమాదవశాత్తు పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.
https://x.com/PTI_News/status/2036646349463273688
సుమారు 13 ఏండ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన హరీశ్ రాణా కారుణ్య మరణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులు హరీశ్ రాణాకు తుది వీడ్కోలు పలికారు. 13 ఏళ్ల నరకం నుంచి హరీశ్ రాణాకు విముక్తి కల్పించే ప్రక్రియను మార్చి 16న మొదలు పెట్టారు. హరీశ్ రాణాను కృత్రిమ శ్వాస వ్యవస్థ నుంచి క్రమంగా తప్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలోనే మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఎలాంటి నొప్పి కలగకుండా, ఇబ్బంది పడకుండా ఉండేలా హరీశ్ రాణాకు లైఫ్ సపోర్ట్‌ను కొంచెం కొంచెంగా వైద్యులు తగ్గిస్తూ వచ్చారు. భారతదేశ న్యాయ, వైద్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిష్క్రియాత్మక కారుణ్య మరణం ఒక వ్యక్తికి ఆచరణలో అమలు కావడం ఇదే తొలిసారి.
https://x.com/ANI/status/2036651694403317801
Also Read..
BRS | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



