త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kabeer Chhillar | 6 గంట‌ల గ్రూప్ స్ట‌డీ కంటే.. 2 గంట‌ల సెల్ఫ్ స్ట‌డీ బెస్ట్.. జేఈఈ టాపర్ మ‌నోగ‌తం ఇదీ..

Kabeer Chhillar | జేఈఈ టాప‌ర్‌( JEE Topper )గా నిల‌వ‌డం అంటే అంత సుల‌భ‌మేమి కాదు. రోజుకు 10 గంట‌ల‌కు పైగా చ‌దివితే కానీ టాప‌ర్‌గా నిల‌వ‌రు. ఒక ప‌క్క ప్ర‌ణాళిక‌తో, స‌రైన గైడెన్స్‌లో చ‌దివితేనే 100కు 100 ప‌ర్సంటైల్ సాధించొచ్చు. అలా రోజుకు 12 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివి 100కు 100 ప‌ర్సంటైల్ సాధించిన ఓ జేఈఈ టాప‌ర్ క‌బీర్ చిల్లార్( Kabeer Chhillar ) స‌క్సెస్ ఇదీ.

S

National | Published On Feb 20, 2026, 7.24 pm IST

Kabeer Chhillar | 6 గంట‌ల గ్రూప్ స్ట‌డీ కంటే.. 2 గంట‌ల సెల్ఫ్ స్ట‌డీ బెస్ట్.. జేఈఈ టాపర్ మ‌నోగ‌తం ఇదీ..
Advertisement

Kabeer Chhillar | త్రినేత్ర‌.న్యూస్ : జేఈఈ టాప‌ర్‌( JEE Topper )గా నిల‌వ‌డం అంటే అంత సుల‌భ‌మేమి కాదు. రోజుకు 10 గంట‌ల‌కు పైగా చ‌దివితే కానీ టాప‌ర్‌గా నిల‌వ‌రు. ఒక ప‌క్క ప్ర‌ణాళిక‌తో, స‌రైన గైడెన్స్‌లో చ‌దివితేనే 100కు 100 ప‌ర్సంటైల్ సాధించొచ్చు. అలా రోజుకు 12 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివి 100కు 100 ప‌ర్సంటైల్ సాధించిన ఓ జేఈఈ టాప‌ర్ స‌క్సెస్ ఇదీ.

ఈ నెల 16వ తేదీన వెల్ల‌డించిన జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1 ఫ‌లితాల్లో గురుగ్రామ్‌కు చెందిన క‌బీర్ చిల్లార్( Kabeer Chhillar ) 100కు 100 ప‌ర్సంటైల్ సాధించిన 12 మందిలో ఒక‌డిగా నిలిచాడు. ఈ నేప‌థ్యంలో జేఈఈ మెయిన్స్‌( JEE Mains )కు ప్రిపేర‌వుతున్న విద్యార్థుల‌కు అత‌ను ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చెబుతూ.. త‌న విజ‌య‌గాథ‌ను చెప్పుకొచ్చాడు.

జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1లో 100కు 100 ప‌ర్సంటైల్ సాధించ‌డం సంతోషంగా ఉంది. రోజుకు త‌ప్ప‌నిస‌రిగా 7 నుంచి 9 గంట‌ల పాటు చ‌దివాను. అవ‌స‌ర‌మ‌నిస్తే ఆ స‌మ‌యాన్ని 8-12 గంట‌ల‌కు పొడిగించాను. అయితే గ్రూప్ స్ట‌డీ కంటే సెల్ఫ్ స్ట‌డీ( Self Study )కే ప్రాధాన్య‌త ఇస్తాను. ఆరు గంట‌ల పాటు గ్రూప్ స్ట‌డీ( Group Study ) చేయ‌డం కంటే.. రెండు గంట‌ల పాటు సెల్ఫ్ స్ట‌డీ చేయ‌డం ఉత్త‌మం. ఇక ప్ర‌తి మాక్ టెస్టు అనంత‌రం త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటూ అనాల‌సిస్ చేసుకునేవాడిని. ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్టులు రాయ‌డం వ‌ల్లే టాప‌ర్‌గా నిల‌వ‌డం సాధ్య‌మైంది అని క‌బీర్ చిల్ల‌ర్ పేర్కొన్నాడు.

2024 టాప‌రే ఆద‌ర్శం..

  • జేఈఈ మెయిన్ -2024లో టాప‌ర్‌గా నిలిచిన వేద్ ల‌హోటి త‌న‌కు ఆద‌ర్శం. అత‌ని ప్రిప‌రేష‌న్ విధానం బాగా న‌చ్చింది. వేద్ కూడా కోట‌లోనే కోచింగ్ తీసుకున్నాడు. నేను కూడా అక్క‌డే కోచింగ్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మొత్తానికి కోట‌లో కోచింగ్ తీసుకుని విజ‌యం సాధించాన‌ని క‌బీర్ తెలిపాడు.

8వ త‌ర‌గ‌తి నుంచే కోచింగ్..

  • ఎలాగైనా ఐఐటీల్లో చ‌ద‌వాల‌నే బ‌ల‌మైన సంక‌ల్పంతో.. 8వ త‌ర‌గ‌తి నుంచే జేఈఈకి ప్రిపేర‌వుతున్నాను. నాకు గ‌ణితం ఇష్ట‌మైన స‌బ్జెక్ట్. సైన్స్ కూడా ఎంతో ఇష్టం. 11వ త‌ర‌గ‌తిలో చేరే నాటికి ఫిజిక్స్‌పై మ‌రింత ప‌ట్టు సంపాదించాను. 12వ త‌ర‌గ‌తికి వ‌చ్చేస‌రికి.. కెమిస్ట్రీపై కూడా పూర్తి ప‌ట్టు సంపాదించాను. బ‌యోల‌జీలోనూ మంచి మార్కులే సాధించేవాడిని. అయినా కూడా మెడిసిన్ వైపు దృష్టి పెట్ట‌కుండా.. ఇంజినీరింగ్ చేయాల‌నే సంక‌ల్పంతోనే జేఈఈకి ప్రిపేర్ అయిన‌ట్లు క‌బీర్ పేర్కొన్నాడు.

ప‌దో త‌ర‌గ‌తిలోనూ మంచి మార్కులు

  • క‌బీర్ చిల్లార్ ప‌దో త‌ర‌గ‌తిలోనూ మంచి మార్కులు సంపాదించాడు. గ‌ణితంలో 99, సైన్స్‌లో 99, స్పానిష్‌లో 99, ఇంగ్లీష్‌లో 97, సోష‌ల్ సైన్సెస్‌లో 97, ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో 100 మార్కులు సాధించాడు.

తండ్రి ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ విద్యార్థి..

  • క‌బీర్ చిల్లార్ తండ్రి మోహిత్ చిల్లార్.. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ విద్యార్థి. 1997లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ ప్ర‌యివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. క‌బీర్ త‌ల్లి ప్రియాంక చిల్లార్ గ‌ణితం, సైన్స్ టీచ‌ర్‌గా ఓ స్కూల్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఐఐటీలో సీటు కొట్టాల‌ని త‌న పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురి చేయ‌లేద‌ని క‌బీర్ తెలిపాడు.

ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌గా ఎద‌గాల‌ని ఉంది..

  • నేను ప్రస్తుతం IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ లక్ష్యంగా పెట్టుకున్నాను. అయిన‌ప్ప‌టికీ.. నా దీర్ఘకాలిక ఆకాంక్ష పరిశోధన వైపు ఉంద‌న్నాడు. బహుశా ప్రొఫెసర్ లేదా ఖగోళ శాస్త్రవేత్తగా ఎద‌గాల‌ని ఉంది అని క‌బీర్ త‌న మ‌నసులో మాట చెప్పుకొచ్చాడు.
Advertisement

తాజావార్తలు

Advertisement