IRCTC | ఒక్కరోజే 20 లక్షల టికెట్లు.. IRCTC చరిత్రలోనే రికార్డు బుకింగ్స్
IRCTC | పండుగ సీజన్ ప్రారంభంలో రైలు టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో IRCTC సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా రికార్డు స్థాయిలో 20,02,353 టికెట్లు బుక్ అయ్యాయి.
IRCTC | త్రినేత్ర.న్యూస్ : పండుగ సీజన్ ప్రారంభం కావడంతో రైలు టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. దీంతో ఇండియన్ రైల్వేస్ ఆన్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ (IRCTC) డిజిటల్ ప్లాట్‌ఫారమ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి (train ticket bookings).
సెప్టెంబర్ 7న ఒక్కరోజే IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా రికార్డు స్థాయిలో 20,02,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ చరిత్రలో ఒక్కరోజులోనే 20 లక్షల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 8న 19,50,699 టికెట్లు బుక్ అయినట్లు తెలిపారు. గతేడాది పండుగ సీజన్‌లో ఆగస్టు 19న గరిష్టంగా ఒక్క రోజులో 18,40,203 టికెట్లు బుక్ అయినట్లు చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది సుమారు 6 శాతం మేర వృద్ధి నమోదైనట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రైల్వే రిజర్వ్‌డ్ టికెట్లలో 89 శాతం ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఈ భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు.. అదనపు సర్వర్లు, ఎన్‌జీఈటీ (NGeT) వ్యవస్థలో మార్పులు, సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, యాంటీ-బాట్ టెక్నాలజీ (Anti-bot technology) వంటి ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.
సాధారణంగా ఉదయం 10, 11 గంటలకు తత్కాల్ బుకింగ్స్ మొదలైనప్పటికీ.. ఉదయం 8 గంటల సమయానికి సాధారణ రిజర్వేషన్లు (advance reservation period) ఓపెన్ అవుతాయి. ప్రయాణికులు తమకు నచ్చిన సీట్లు లేదా బెర్తుల కోసం విండో ఓపెన్ అయిన మొదటి గంటలోనే టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు. ఈ క్రమంలోనే రోజు మొత్తంలో జరిగే బేకింగ్స్‌లో 8.43% - 14.14% వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య పూర్తవుతాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఫలితంగా విండో ఓపెన్ అయిన మొదటి గంటలోనే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌పై విపరీతమైన ట్రాఫిక్, లోడ్ పెరుగుతుందని వెల్లడించింది. మిగిలిన 85 శాతానికి పైగా బుకింగ్‌లు రోజంతా సాగుతాయని వివరించింది.
Also Read..
ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?
బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
సెప్టెంబర్ 11, 2026

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
సెప్టెంబర్ 11, 2026

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?
- ●Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..
- ●Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
- ●Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి
- ●Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు షాక్.. 3 నెలల కనిష్ఠానికి నిఫ్టీ..

UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?

Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు

Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి



