AFCAT | 10+2, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులోకి ఎంట్రీ..
AFCAT | మీరు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారా?. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరాలని ఉందా?. అయితే ఇంకెందుకు ఆలోచించడం.. మీకోసమే భారత వైమానిక దళం (Indian Air Force) ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యీటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచ్‌లలో గ్రూప్-ఏ గెజిటెడ్ ఆఫీర్లుగా నియామకం కోసం కోర్సులను అందిస్తున్నది.
AFCAT | త్రినేత్ర.న్యూస్: మీరు పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశారా?. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరాలని ఉందా?. అయితే ఇంకెందుకు ఆలోచించడం.. మీకోసమే భారత వైమానిక దళం (Indian Air Force) ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యీటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచ్‌లలో గ్రూప్-ఏ గెజిటెడ్ ఆఫీర్లుగా నియామకం కోసం కోర్సులను అందిస్తున్నది. జూలైలో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) 02/2026 నోటిఫికేషన్‌ను ఐఏఎఫ్ విడుదల చేసింది. ఆసక్తి కలగిన వారు జూన్ 19 వరకు అధికారిక వెబ్‌సైట్ https://afcat.edcil.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు 8న (శనివారం) నిర్వహించనున్నారు.
పోస్టుల వారీగా వివరాలు
- షార్ట్ సర్వీస్ కమిషన్- పురుషులు: 30, మహిళలు: 5
- గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 211
- ఏరోనాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్- AE(L): 136
- ఏరోనాటికల్ ఇంజినీర్ మెకానికల్- AE(M): 75
- గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)- 107
- వెపన్ సిస్టమ్స్ (WS)- పురుషులు 21, మహిళలు 5
- అడ్మినిస్ట్రేషన్ (Adm)- పురుషులు 50, మహిళలు 12
- లాజిస్టిక్స్ (Lgs)- పురుషులు 4, మహిళలు 2
- అకౌంట్స్ (Accts)- పురుషులు 5, మహిళలు 2
- ఎడ్యుకేషన్ (Edn)- పురుషులు 1, మహిళలు 2
- మెటియోరాలజీ (Met)- పురుషులు 1, మహిళలు 2
GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్):
- AE(L)- పురుషులు 13 (1-PC, 12-SSC), మహిళలు 04 (1-PC, 03-SSC)
- AE(M)- పురుషులు 7 (1-PC, 6-SSC), మహిళలు 2 (1-PC, 1-SSC)
ఫ్లయింగ్
- NCC స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీడీఎస్ఈ ఖాళీల నుంచి 10 శాతం (PC కోసం), ఏఎఫ్‌క్యాట్ ఖాళీల నుంచి 10 శాతం (SSC కోసం) కేటాయించారు.
అర్హత..
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. కోర్సు ప్రారంభానికి అవివాహితులై ఉండాలి. ఫ్లయింగ్, వెపన్ సిస్టమ్స్ విభాగాలకు 10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా గత మూడేండ్లలో సాధించిన చెల్లుబాటు అయ్యే గేట్ (GATE) స్కోర్ ఉండాలి.
- టెక్నికల్ విభాగాలకు బ్రాంచ్‌ను బట్టి కామర్స్, అకౌంట్స్ లేదా పీజీ డిగ్రీలు ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఎటువంటి బ్యాక్‌లాగ్‌లు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు జూలై 2027 నాటికి 20- 24 ఏండ్ల మధ్య ఉండాలి. (అంటే జూలై 2, 2003, జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి). డీజీసీఏ ఇండియా జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్టంగా 26 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఎంపిక మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు వస్తే, తప్పు సమాధానానికి -1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ పరీక్షస్టేజ్-I (ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ & పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్), స్టేజ్-II (సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ)
ఫ్లయింగ్ బ్రాంచ్- సీపీఎస్‌ఎస్ పైలట్ పరీక్ష, వైద్య పరీక్షలు. మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.550+జీఎస్‌టీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అండ్ గేట్ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 19
పరీక్ష తేదీ: ఆగస్టు 8న
వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT/
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






