త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Surya Kant | ప్ర‌తి ఐదుగురు టీనేజ‌ర్ల‌లో ఒకరికి డ్ర‌గ్స్ ముప్పు: సీజేఐ

CJI Surya Kant | పిల్లల్లో పెరుగుతున్న‌ మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనాన్ని కేవలం సాధారణ ప్రజారోగ్య సమస్యగా కాకుండా.. పిల్ల‌ల సంర‌క్ష‌ణ (child protection issue) అంశంగా చూడాల‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) ఉద్ఘాటించారు.

D

National | Published On Sep 26, 2026, 2.59 pm IST

CJI Surya Kant | ప్ర‌తి ఐదుగురు టీనేజ‌ర్ల‌లో ఒకరికి డ్ర‌గ్స్ ముప్పు: సీజేఐ
Advertisement

CJI Surya Kant | దేశంలో యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్ర‌గ్స్ స‌మ‌స్య‌పై భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పిల్లల్లో పెరుగుతున్న‌ మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనాన్ని కేవలం సాధారణ ప్రజారోగ్య సమస్యగా కాకుండా.. ఇది పిల్ల‌ల సంర‌క్ష‌ణ (child protection issue) అంశంగా చూడాల‌ని ఉద్ఘాటించారు.

బీహార్ లోక్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ సెమినార్‌లో సీజేఐ పాల్గొని ప్ర‌సంగించారు. భారతదేశంలో యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ ప్రతి ఐదుగురు పిల్ల‌ల్లో కనీసం ఒకరు మాదకద్రవ్యాల బారిన పడే ముప్పును ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ మేర‌కు ఇటీవ‌లే లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యసనాల బారిన ప‌డిన పిల్ల‌ల ప‌ట్ల సమాజం, వ్యవస్థలు సున్నితంగా స్పందించాల‌న్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేలా ఉండాల‌ని సూచించారు.

అస‌లైన పున‌రావాసం అంటే పిల్లలను కేవలం వ్యసనం నుంచి దూరం చేయడం మాత్రమే కాద‌ని సీజేఐ పేర్కొన్నారు. బాల్యాన్ని, విద్య‌ను, మంచి మాన‌వ సంబంధాల‌ను, ఆట‌లు, న‌మ్మ‌కం, భ‌విష్య‌త్తుపై భ‌రోసానిచ్చే వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డ‌మే నిజ‌మైన పున‌రావాసం అని తేల్చి చెప్పారు. పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారికి డ్రగ్స్ అలవాటు చేస్తూ వారి జీవితాలతో ఆడుకునే ముఠాలు, డ్రగ్ పెడ్లర్లపై చ‌ట్టం అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ నొక్కి చెప్పారు.

Also Read..

ఫుల్‌గా మందుకొట్టి ప‌డుకున్న కోతి.. VIDEO

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్‌

కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామ‌చంద‌ర్ రావు

Advertisement
Advertisement