IAF Agniveer Vayu | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత
IAF Agniveer Vayu | అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ (Agniveer) వాయు నియామకాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి (IAF Agniveer Vayu) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నది.
IAF Agniveer Vayu | త్రినేత్ర.న్యూస్: అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ (Agniveer) వాయు నియామకాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి (IAF Agniveer Vayu) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెల 6 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 26న దరఖాస్తుల గడువు పూర్తికానుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారు భారత వాయుసేనలో నాలుగేండ్లపాటు అగ్నివీర్‌గా సేవలందించవచ్చు. మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో సంవత్సరం రూ.33వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40 వేల జీతం అందుతుంది. వీటితో పాటు అదనంగా రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, డ్రెస్, ట్రావెల్ అలవెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు(02/ 2027) బ్యాచ్ నియామకం
అర్హతలు
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్(10+2) లేదా ఇంటర్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 2005 జూలై 1 నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించిన వారై ఉండాలి.
పురుషులు/మహిళలు 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఈశాన్య లేదా ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు 147 సెం.మీ. ఉన్నా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 6
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 26
అప్లికేషన్ ఫీజు: రూ.550, జీఎస్‌టీ అదనం
ఆన్‌లైన్ ఎగ్జామ్స్: సెప్టెంబర్ 22, 23 తేదీల్లో..
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

Abhinandan Varthaman | ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జర్నీ
సెప్టెంబర్ 3, 2026

Rafale Fighter Jets | భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు.. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్‌ను సిద్ధం చేసిన రక్షణ శాఖ
మే 25, 2026

Sukhoi Fighter Jet | కుప్పకూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
మార్చి 6, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో
- ●America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
- ●MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ
- ●Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?
- ●Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ●TMC Office | కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ

Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక

MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ

Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?



