Ballari | ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో దారుణం.. సహచరులపై 9వ తరగతి విద్యార్థి ఘాతుకం.. ఒకరు మృతి
Ballari | కర్ణాటకలోని బళ్లారిలో (Ballari) దారుణం జరిగింది. ప్రైవేట్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో సహచరులపై 9వ తరగతి విద్యార్థి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న విద్యార్థులపై ఇనుప రాడ్డు (Iron Rod), కత్తితో దాడి చేశాడు.
Ballari | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలోని బళ్లారిలో (Ballari) దారుణం జరిగింది. ప్రైవేట్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో సహచరులపై 9వ తరగతి విద్యార్థి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న విద్యార్థులపై ఇనుప రాడ్డు (Iron Rod), కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వార్డెన్‌పై కూడా దాడిచేయడంతో.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు.
బళ్లారిలోని గురుకుల ఆశ్రమ ఇంటర్నేషనల్ ప్రైవేటు స్కూలులో 9 మంది విద్యార్థులపై భరత్ అనే తోటి విద్యార్థి ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన హేమంత్ విద్యార్థి మృతిచెందాడు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, దాడి తర్వాత భరత్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు దవాఖానకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఒక్కడే ఇంతమంది దాడి చేశాడా? లేదా ఎవరి సహాయమైనా తీసుకున్నాడా? అని ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్టాక్ మార్కెట్ల పతనంతో భారీగా నష్టపోయిన ఎస్‌బీఐ
మిస్టర్ ప్రెసిడెంట్, మీ పని మీరు చూసుకోండి: కమలహాసన్
అప్పుడు షారుఖ్ - ఇప్పుడు సల్మాన్‌తో రొమాన్స్ - బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన నయన్
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






