త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamal Haasan | మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, మీ ప‌ని మీరు చూసుకోండి: క‌మ‌ల‌హాస‌న్

Kamal Haasan | భార‌త్ ఇత‌ర దేశాల ఆదేశాల‌ను పాటించ‌బోద‌ని రాజ్య‌స‌భ ఎంపీ, మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధినేత క‌మ‌ల‌హాస‌న్ అన్నారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ స‌ప్లై చెయిన్స్‌ దెబ్బతిన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్‌కు వాషింగ్టన్ అనుమతి ఇచ్చింది అని అమెరికా ప్రముఖ అధికారి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు.

S

National | Published On Mar 8, 2026, 12.02 pm IST

Kamal Haasan | మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, మీ ప‌ని మీరు చూసుకోండి: క‌మ‌ల‌హాస‌న్
Advertisement

Kamal Haasan | భార‌త్ ఇత‌ర దేశాల ఆదేశాల‌ను పాటించ‌బోద‌ని రాజ్య‌స‌భ ఎంపీ, మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధినేత క‌మ‌ల‌హాస‌న్ అన్నారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ స‌ప్లై చెయిన్స్‌ దెబ్బతిన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్‌కు వాషింగ్టన్ అనుమతి ఇచ్చింది అని అమెరికా ప్రముఖ అధికారి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. భారత్ ఇతర దేశాల ఆదేశాలను పాటించే దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు క‌మ‌ల‌హాస‌న్ త‌న ఎక్స్ ఖాతాలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు.

మీ ప‌ని మీరు చూసుకోండి: క‌మ‌ల‌హాస‌న్‌

డియ‌ర్ మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌. మేం భార‌త ప్ర‌జ‌లం స్వ‌తంత్ర‌, సార్వ‌భౌమ దేశానికి చెందిన వాళ్లం. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే విదేశీ ఆదేశాల‌ను మేం ఇక‌పై పాటించం. ద‌య‌చేసి మీ ప‌ని మీరు చూసుకోండి.. అని క‌మ‌ల‌హాస‌న్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవమే స్థిరమైన ప్రపంచ శాంతికి పునాది. మీ దేశానికి, అక్కడి ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని మేం ఆకాంక్షిస్తున్నాం.. అని అన్నారు.

https://twitter.com/ikamalhaasan/status/2030277810103939561

రాజీప‌డిన వ్య‌క్తి ప‌రిస్థితి ఫ‌లిత‌మే ఇది: రాహుల్ గాంధీ

కాగా మ‌రోవైపు అమెరికా అధికారి చేసిన వ్యాఖ్య‌లపై కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసింది. భార‌త విదేశాంగ విధానం మా ప్ర‌జ‌ల స‌మిష్టి సంక‌ల్పం నుంచి రూపుదిద్దుకుంటుంది. అది మా చ‌రిత్ర‌, మా భౌగోళిక ప‌రిస్థితులు, స‌త్యం, అహింస‌ల‌పై ఆధార‌ప‌డిన ఆధ్యాత్మిక విలువల‌పై నిల‌బ‌డాలి. కానీ ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న‌ది విధానం కాదు. ఒక రాజీ ప‌డిన వ్య‌క్తిని ఉప‌యోగించుకునే ప‌రిస్థితి ఫ‌లిత‌మే.. అని లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అంత‌కు ముందు అమెరికా ట్రెజ‌రీ కార్య‌ద‌ర్శి, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స‌హాయ‌కుడు స్కాట్ బెస్సెంట్ ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయులు చాలా స‌హ‌క‌రించారు. ఈ ఏడాదిలో ర‌ష్యా నుంచి చ‌మురును కొనుగోలు చేయ‌డం నిలిపివేయాల‌ని మేం వారిని కోరాం. వారు అలాగే చేశారు. దానికి బ‌దులుగా అమెరికా చ‌మురు కొనుగోలు చేయాల‌ని భావించారు. కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు స‌ర‌ఫ‌రాలో తాత్కాలిక లోటును త‌గ్గించేందుకు తిరిగి ర‌ష్యా చ‌మురును కొనేందుకు మేం వారికి అనుమ‌తి ఇచ్చాం. భ‌విష్య‌త్తులో ర‌ష్యా చ‌మురు స‌ర‌ఫ‌రాల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను కూడా ఎత్తివేయ‌వ‌చ్చు.. అని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై ప్ర‌తిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

Advertisement
Advertisement