Girl Incident | ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన చిన్నారి.. కాపాడిన డ్రెస్సు
ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బావి (well) లో పడిపోగా వేసుకున్న డ్రెస్సే (Dress) ఆమెకు శ్రీరామ రక్ష అయింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా 50 అడుగుల లోతైన నీటి బావిలో పడిపోయింది. పాకు తొడిగిన డ్రెస్సే ప్రాణాలను నిలబెట్టింది.
త్రినేత్ర.న్యూస్: ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బావి (well) లో పడిపోగా వేసుకున్న డ్రెస్సే (Dress) ఆమెకు శ్రీరామ రక్ష అయింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా 50 అడుగుల లోతైన నీటి బావిలో పడిపోయింది. పాకు తొడిగిన డ్రెస్సే ప్రాణాలను నిలబెట్టింది. ఈ విచిత్ర ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం సిర్సిలో సోమవారం చోటుచేసుకుంది.
భువి (Bhuvi) అనే రెండున్నరేళ్ల పాప ఇంటి సమీపంలో ఆడుకుంటూ బావిలో పడిపోయింది. వేసుకున్న దుస్తులు మోటారు పైపు (Motor pipe) లో చిక్కుకోవడంతో అదృష్టవశాత్తు నీటిలో మునిగిపోలేదు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్న క్రమంలో బావిలో నుంచి కేకలు వినిపించాయి. వెంటనే వారు బావి వద్దకు వెళ్లి చూడగా లోపల ఉన్న మోటారు పైపులో ఆమె దుస్తులు చిక్కుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికుల్లో ఒకరు తాడు సాయంతో బావిలోకి దిగారు. సుమారు అరగంట పాటు శ్రమించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
సంబంధిత వార్తలు

Keralam Election Results | కాంగ్రెస్కు బూస్ట్.. కేరళంలో యూడీఎఫ్ కూటమి జయకేతనం..!
మే 4, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026

Telangana Revenue | సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా..!! తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనం
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



