Osteoporosis And Osteoarthritis | ఆస్టియో పొరోసిస్, ఆస్టియో ఆర్థ్రైటిస్.. రెండూ ఒక్కటేనా.. తేడాలేమిటి..?
Osteoporosis And Osteoarthritis | వయస్సు పెరిగేకొద్దీ కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఆస్టియోపొరోసిస్, ఆస్టియో ఆర్థ్రైటిస్ ప్రధానమైనవి. ఈ రెండు వ్యాధులను చాలామంది ఒకటేనని భావిస్తారు. ఎందుకంటే రెండూ ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తాయి. నొప్పులు, నడకలో ఇబ్బందులు, జీవన నాణ్యత తగ్గడం వంటి సమస్యలు రెండింట్లోనూ ఉంటాయి. అయితే వైద్యుల ప్రకారం ఈ రెండు పూర్తిగా భిన్నమైన సమస్యలు.
Osteoporosis And Osteoarthritis | వయస్సు పెరిగేకొద్దీ కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఆస్టియోపొరోసిస్, ఆస్టియో ఆర్థ్రైటిస్ ప్రధానమైనవి. ఈ రెండు వ్యాధులను చాలామంది ఒకటేనని భావిస్తారు. ఎందుకంటే రెండూ ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తాయి. నొప్పులు, నడకలో ఇబ్బందులు, జీవన నాణ్యత తగ్గడం వంటి సమస్యలు రెండింట్లోనూ ఉంటాయి. అయితే వైద్యుల ప్రకారం ఈ రెండు పూర్తిగా భిన్నమైన సమస్యలు. శరీరంపై ప్రభావం చూపే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆస్టియో పొరోసిస్‌లో ఎముకలు బలహీనపడుతూ సులభంగా విరిగే స్థితికి చేరుకుంటాయి. మరోవైపు ఆస్టియో ఆర్థ్రైటిస్‌లో కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ క్రమంగా దెబ్బతింటుంది. అందువల్ల నొప్పులు, గట్టిపడటం, వాపు, కదలికలో ఇబ్బందులు వస్తాయి. ఈ తేడాలను గుర్తించడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానాలు రెండింటికీ వేర్వేరుగా ఉంటాయి.
ఆస్టియో పొరోసిస్ అంటే..
ఆస్టియో పొరోసిస్‌లో ఎముకల డెన్సిటీ (సాంద్రత) తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారి చిన్న దెబ్బకే విరిగే ప్రమాదం పెరుగుతుంది. దీనిని సైలెంట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా మందికి ఎముక విరిగే వరకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలియదు. ఆస్టియోపొరోసిస్ ముఖ్య లక్షణాలు ఇలా ఉంటాయి. ఎముకలు బలహీనపడటం, కాలక్రమంలో ఎత్తు తగ్గడం, వెన్నెముక ఫ్రాక్చర్ల వల్ల వెన్నునొప్పి, చిన్నగా జారి పడినా ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే..
ఆస్టియో ఆర్థ్రైటిస్‌లో కీళ్లను రక్షించే కార్టిలేజ్ క్రమంగా తరిగిపోతుంది. దీంతో కీళ్ల మధ్య రాపిడి పెరిగి నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, నడుము భాగం, చేతి వేళ్ల కీళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్ లక్షణాలు ఇలా ఉంటాయి. కీళ్ల గట్టిపడటం, మోకాళ్లు లేదా నడుములో నొప్పి, కీళ్ల చుట్టూ వాపు, కదలికలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రెండు వ్యాధుల మధ్య ప్రధాన తేడాలు..
ఆస్టియోపొరోసిస్ ఎముకల బలాన్ని ప్రభావితం చేస్తుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్ కీళ్ల కార్టిలేజ్‌ను దెబ్బతీస్తుంది. ఆస్టియో పొరోసిస్‌లో ఫ్రాక్చర్ ప్రమాదం ఎక్కువ. ఆస్టియో ఆర్థ్రైటిస్‌లో కీళ్ల నొప్పి, గట్టిపడటం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియో పొరోసిస్ ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. ఆస్టియో ఆర్థ్రైటిస్ లక్షణాలు క్రమంగా బయటపడతాయి. వైద్యలు తెలిపిన ప్రకారం మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియో పొరోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. వయస్సు పెరగడం, హార్మోన్ల మార్పులు, కాల్షియం లోపం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. అలాగే వయస్సు పెరగడం, ఊబకాయం, పాత కీళ్ల గాయాలు, కీళ్లపై అధిక ఒత్తిడి, కుటుంబ చరిత్ర వంటివి ఆస్టియో ఆర్థ్రైటిస్‌కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
రెండూ ఒకేసారి వస్తాయా..?
నిపుణులు తెలిపిన ప్రకారం చాలామంది వృద్ధుల్లో ఈ రెండు సమస్యలు కలిసి కనిపించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆర్థ్రైటిస్ వల్ల నడక తగ్గిపోతే శారీరక చలనం తగ్గుతుంది. దాంతో ఎముకలు మరింత బలహీనపడి ఆస్టియో పొరోసిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ రెండు కలిసి ఉంటే సమతుల్యత, నడక, స్వతంత్ర జీవనం మరింత కష్టమవుతుంది. ఆస్టియో పొరోసిస్‌ను గుర్తించడానికి సాధారణంగా డెక్సా స్కాన్ చేస్తారు. దీనివల్ల ఎముకల మినరల్ డెన్సిటీని కొలుస్తారు. ఆస్టియో ఆర్థ్రైటిస్ నిర్ధారణ కోసం శారీరక పరీక్ష, ఎక్స్‌రేలు, కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ స్కాన్, నొప్పి, కదలికల అంచనాను బట్టి వ్యాధిని నిర్దారిస్తారు. నిపుణులు చెప్పిన ప్రకారం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ రెండు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఈ సూచనలు పాటించాలి..
రెగ్యులర్ వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్, సరైన బరువు నియంత్రణలో ఉండేలా చూడడం, కాల్షియం, విటమిన్ డి సరిపడా తీసుకోవడం, ధూమపానం, అధిక మద్యం వాడకం మానేయడం వంటి అలవాట్లను పాటిస్తే ఈ వ్యాధుల ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక వ్యాయామం వల్ల ఎముకలు బలపడటంతోపాటు కీళ్ల కదలికలు కూడా మెరుగుపడతాయి. ఆస్టియో పొరోసిస్, ఆస్టియో ఆర్థ్రైటిస్ పేర్లు ఒకేలా అనిపించినా ఇవి పూర్తిగా భిన్నమైన సమస్యలని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఫ్రాక్చర్లను తగ్గించుకోవచ్చు. అలాగే కదలికలు మెరుగుపడి జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు
అక్టోబర్ 16, 2026

Vitamin D | విటమిన్ డి ట్యాబ్లెట్లను ఎంత కాలం పాటు వాడాల్సి ఉంటుంది.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 5, 2026

Vitamin D | విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ను తగ్గించొచ్చు.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?

MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!



