Vitamin D | విటమిన్ డి ట్యాబ్లెట్లను ఎంత కాలం పాటు వాడాల్సి ఉంటుంది.. వైద్యులు ఏమంటున్నారు..?
Vitamin D | విటమిన్ డి శరీరానికి కావల్సిన అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతూ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, కణాల అభివృద్ధిపై ప్రభావం చూపడం, అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది దోహదం చేస్తుంది.
Vitamin D | విటమిన్ డి శరీరానికి కావల్సిన అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతూ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, కణాల అభివృద్ధిపై ప్రభావం చూపడం, అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది దోహదం చేస్తుంది. సూర్యకాంతి, సమతుల ఆహారం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. అయితే చాలా మందికి సరిపడా విటమిన్ డి అందడం లేదు. ముఖ్యంగా సూర్యరశ్మి తక్కువగా అందుకునే వారు లేదా ఆహారంలో తీసుకునే విటమిన్ డి లోపం ఉన్నవారికి విటమిన్ డి సప్లిమెంట్స్ ను వైద్యులు సూచిస్తారు. అయితే ఈ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మోతాదును నియంత్రించడం చాలా ముఖ్యం. అధికంగా తీసుకుంటే టాక్సిసిటీ ఏర్పడి వికారం, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో కిడ్నీ డ్యామేజ్ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి.
రోజూ 600 నుంచి 800 ఐయూ వరకు అవసరం..
విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకునే కాలం వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ప్రస్తుత విటమిన్ డి స్థాయిలు, జీవనశైలి, నివసించే ప్రదేశం వంటి అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి సాధారణంగా కొన్ని నెలలపాటు అధిక మోతాదులో సప్లిమెంట్స్ ఇస్తారు. దీని ద్వారా రక్తంలో విటమిన్ డి స్థాయిలు ఆరోగ్యకరమైన స్థాయికి చేరుకుంటాయి. కొంతమందికి దీర్ఘకాలం లేదా నిరంతరం విటమిన్ డి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా సూర్యకాంతి తక్కువగా పొందే వారు దీర్ఘకాలంగా సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. సాధారణంగా పెద్దలు రోజుకు 15 నుంచి 20 మైక్రోగ్రాముల (600 నుంచి 800 ఐయూ) వరకు విటమిన్ డి ట్యాబ్లెట్లను తీసుకోవడం సురక్షితంగా చెబుతారు. అయితే ఇది డాక్టర్ సూచనలపై ఆధారపడి మారుతుంది.
అధికంగా తీసుకుంటే నష్టమే..
విటమిన్ డిని అధికంగా తీసుకుంటే హైపర్ కాల్సీమియా (రక్తంలో కాల్షియం అధికం అవడం) ఏర్పడుతుంది. ఇది గుండె, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు రక్తపరీక్ష చేయించడం అత్యంత కీలకం. కొత్త సప్లిమెంటేషన్ ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత మళ్లీ పరీక్ష చేసి స్థాయిలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. విటమిన్ డి వంటి సప్లిమెంట్స్‌ను స్వయంగా ప్రారంభించడం లేదా ఆపడం ప్రమాదకరం. తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. విటమిన్ డి ఆరోగ్యానికి అత్యంత కీలకం అయినా సప్లిమెంట్స్‌ను సరైన విధంగా, నియంత్రిత మోతాదులో, వైద్యుల సూచనలతో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. సొంత వైద్యం పనికిరాదని నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



