Vitamin D | విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడితే బ్రెస్ట్ క్యాన్సర్‌ను తగ్గించొచ్చు.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
Vitamin D | భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఇద్దరు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయితే, అందులో ఒకరు మరణిస్తున్నారని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో రోగులకు అనుగుణంగా చికిత్సను మెరుగుపరచడం అత్యవసరంగా మారింది.
Vitamin D | భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఇద్దరు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయితే, అందులో ఒకరు మరణిస్తున్నారని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో రోగులకు అనుగుణంగా చికిత్సను మెరుగుపరచడం అత్యవసరంగా మారింది. ఇటీవల జరిగిన ఒక కొత్త అధ్యయనం విటమిన్ డి పాత్రపై దృష్టి సారించింది. శరీర రోగనిరోధక శక్తికి కీలకమైన విటమిన్ డి లోపం 66.4 శాతం మందిలో ఉన్నట్లు గుర్తించారు. ఎముకలు, దంతాల అభివృద్ధి మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచడంలో కూడా ఇది కీలకంగా నిలుస్తుంది. బ్రెజిల్‌లోని సావో పౌలో స్టేట్ యూనివర్సిటీకి చెందిన బోట్‌కాట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో జరిగిన అధ్యయనం ప్రకారం రోజువారీగా తక్కువ మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల కీమోథెరపీ ఫలితాలను మెరుగుపరచవచ్చని తేలింది. ఈ చిన్న స్థాయి అధ్యయనంలో, చికిత్సతోపాటు విటమిన్ డి తీసుకున్న మహిళల్లో క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. దీన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న సహాయక చికిత్సగా మరింతగా పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రోజూ 2000 IU విటమిన్ డి..
ఎక్స్‌పరిమెంటల్ అండ్ మాలిక్యులార్ పాథాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం విటమిన్ డి శరీర రోగనిరోధక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదల, శరీర కణాల వాపు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీతో కలిసి పనిచేసి చికిత్స ఫలితాలను మెరుగుపరిచే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. పరిశోధనలో 45 ఏళ్లు పైబడిన 80 మంది మహిళలను పరిశీలించారు. ఒక గ్రూప్‌కు రోజుకు 2,000 IU విటమిన్ డి ఇచ్చారు. మరొక గ్రూప్‌కు ప్లేసీబో మాత్రలు ఇచ్చారు. అందరూ సర్జరీకి ముందు ఇచ్చే నియో అడ్జువెంట్ కీమోథెరపీ తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత స్పష్టమైన తేడా కనిపించింది. విటమిన్ డి తీసుకున్న వారిలో 43 శాతం మందికి క్యాన్సర్ పూర్తిగా తగ్గింది. ప్లేసీబో గ్రూప్‌లో ఇది కేవలం 24 శాతంగా మాత్రమే నమోదైంది.
బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో విటమిన్ డి లోపం..
న్యూట్రియెంట్స్ అనే జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది. సూర్యకాంతి లోపం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు దీనికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే చికిత్స ప్రభావం కూడా తగ్గే ప్రమాదం ఉందని, అందుకే సరైన ఆహారం, సూర్యకాంతి ద్వారా ఈ లోపాన్ని సరిచేయడం అవసరం అని సూచిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులు తప్పనిసరిగా తమ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలని, సప్లిమెంట్ మోతాదు ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిర్ణయించాలని తెలిపారు. ఇప్పటికే తీవ్రమైన మందులు తీసుకుంటున్నందున, స్వయంగా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.
నిపుణులను సంప్రదించాలి..
ఈ అధ్యయనం వల్ల విటమిన్ డి సప్లిమెంటేషన్ కీమోథెరపీ ఫలితాలను మెరుగుపరుస్తుందని సూచించినప్పటికీ, ఇది ప్రామాణిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, మరింత విస్తృత క్లినికల్ ట్రయల్స్ అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విటమిన్ డి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో సహాయక పాత్ర పోషించే అవకాశం ఉందని తాజా పరిశోధన చెబుతోంది. అయితే ఇది పూర్తి పరిష్కారం కాదు. క్రమమైన సూర్యకాంతి, పోషకాహారం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. రోగులు తమకు ఉండే సలహాలు లేదా మందుల మార్పు, విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వంటి అంశాలపై వైద్యులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..
సెప్టెంబర్ 5, 2026

Mango | మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా? న్యూట్రిషనిస్టులు చెప్పిన నిజం..
జూన్ 26, 2026

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
- ●Data Center | హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
- ●Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు
- ●TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్‌కు ఆ అర్హత లేదు
- ●iPhone | సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా..? ఈ 5 విషయాలను తప్పక చెక్ చేయండి..
- ●Anupama Paramewaran | నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవు - మాజీ ప్రియుడిపై అనుపమ సెటైర్స్

MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన

Data Center | హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు

TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్‌కు ఆ అర్హత లేదు



