త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Hellfire Missile Attack | 2 హెల్‌ఫైర్ మిస్సైల్స్‌తో దాడి.. భారతీయులున్న మూడో నౌకపైనా విరుచుకుపడ్డ అమెరికా దళాలు!

గల్ఫ్ తీరంలో భారతీయులున్న నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వరుసగా మూడో షిప్ 'ఎంటీ జల్వీర్'పై అమెరికా దళాలు హెల్‌ఫైర్ మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి.

J

International | Published On Jun 11, 2026, 8.26 pm IST

US Hellfire Missile Attack | 2 హెల్‌ఫైర్ మిస్సైల్స్‌తో దాడి.. భారతీయులున్న మూడో నౌకపైనా విరుచుకుపడ్డ అమెరికా దళాలు!

సంక్షిప్త సారాంశం

ఓమన్ తీరంలో భారతీయులు ఉన్న 'ఎంటీ జల్వీర్' (MT Jalveer) నౌకపై అమెరికా దళాలు రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్ నుంచి ఆయిల్ తరలిస్తున్న ఈ నౌక తమ ఆదేశాలు పాటించకపోవడం వల్లే దాడి చేశామని US సెంట్రల్ కమాండ్ అంగీకరించింది. గత వారం రోజుల్లో అమెరికా బలగాలు దాడులు చేసిన మూడో నౌక ఇది. ఈ నౌకలో ఉన్న 20 మందిలో ఐదుగురిని రక్షించారు. ఈ దాడులను భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. అమెరికా వైఖరిపై తీవ్ర నిరసన (Strong Protest) వ్యక్తం చేసింది.

Advertisement

US Hellfire Missile Attack | త్రినేత్ర.న్యూస్ : గల్ఫ్ (Gulf) సముద్ర జలాల్లో భారతీయ నావికులు (Indian seafarers) ఉన్న నౌకలపై దాడులు ఆగడం లేదు. ఓమన్ తీరంలో 'ఎంటీ జల్వీర్' (MT Jalveer) అనే వాణిజ్య నౌక ఇంజిన్ రూమ్‌పై రెండు 'హెల్‌ఫైర్ మిస్సైల్స్' (Hellfire missiles) తో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) స్వయంగా అంగీకరించింది. గత వారం వ్యవధిలో భారతీయులు ఉన్న నౌకను అమెరికా మిలిటరీ టార్గెట్ చేయడం ఇది వరుసగా మూడోసారి కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

దాడికి కారణం ఏంటి?

ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకువెళ్తున్న గినియా-బిస్సావు జెండాతో ఉన్న 'ఎంటీ జల్వీర్' నౌక తమ ఆదేశాలను పదేపదే బేఖాతరు చేసిందని, అందుకే యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఏప్రిల్ 13న ఇరాన్‌పై బ్లాకేడ్ (ఆంక్షలు) విధించిన తర్వాత ఇప్పటివరకు తమ ఆదేశాలు పాటించని 9 నౌకలను తాము అడ్డుకున్నట్లు అమెరికా తెలిపింది.

మరోవైపు ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. దాడికి గురైన తాజా నౌకలో 20 మంది సిబ్బంది ఉండగా, అటుగా వెళ్తున్న ఇతర నౌకలు ఐదుగురిని రక్షించి ఓమన్‌కు చేర్చాయి. మిగిలిన వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

భారత ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్ తీరంలో వరుసగా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇవి "అత్యంత ఆందోళనకరమైన" (deeply worrisome) పరిణామాలని భారత విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"వెస్ట్ ఆసియాలో మన నావికుల భద్రత, సంక్షేమం మనకు అత్యంత ముఖ్యం. మొన్న ఓమన్ తీరంలో 'సెట్టెబెల్లో' నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులను కోల్పోయాం. దీనిపై యూఎస్ అధికారులకు (US CDA) సమన్లు జారీ చేసి మన తీవ్ర నిరసనను (strong protest) తెలిపాము. మా నిరసనను అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన గురువారం జరిగిన ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు.

లక్ష్యంగా మారుతున్న ఇండియన్ షిప్స్

అమెరికా దళాల దాడికి గురైన మూడో నౌక 'ఎంటీ జల్వీర్'. అంతకుముందు జరిగిన దాడుల వివరాలు ఇవే.

మొదటి దాడి: సోమవారం నాడు 24 మంది ఇండియన్లతో హార్ముజ్ జలసంధి దక్షిణాన వెళ్తున్న 'ఎంటీ మారివెక్స్' (MT Marivex) అనే నౌకపై దాడి జరిగి మంటలు చెలరేగాయి.

రెండో దాడి: పలావు దేశపు జెండాతో ఉన్న 'సెట్టెబెల్లో' (Settebello) ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా చేసిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు.

తాజా దాడి: తాజాగా 'ఎంటీ జల్వీర్'పై మిస్సైల్స్ తో దాడి.

ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ సిబ్బంది భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇరాన్‌ను కట్టడి చేసే క్రమంలో అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు గ్లోబల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement