త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

China Nuclear Missile Sites | ఎడారిలో డ్రాగన్ కంట్రీ భారీ స్కెచ్: అణు స్థావరాల చుట్టూ 80కి పైగా లాంచ్ ప్యాడ్స్.. శాటిలైట్ చిత్రాల్లో సంచలన నిజాలు

చైనాలోని జిన్‌జియాంగ్ ఎడారిలో నిర్మిస్తున్న రహస్య సైనిక స్థావరాల శాటిలైట్ చిత్రాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాను ఢీకొట్టేలా డ్రాగన్ కంట్రీ వ్యూహం ఏంటి?

J

International | Published On May 30, 2026, 3.35 pm IST

China Nuclear Missile Sites | ఎడారిలో డ్రాగన్ కంట్రీ భారీ స్కెచ్: అణు స్థావరాల చుట్టూ 80కి పైగా లాంచ్ ప్యాడ్స్.. శాటిలైట్ చిత్రాల్లో సంచలన నిజాలు
Advertisement
  • వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ఎడారిలో అత్యంత రహస్యంగా భారీ సైనిక స్థావరాల నిర్మాణం
  • అణు క్షిపణులను (Nuclear missiles) భద్రపరిచే కేంద్రాల వద్ద 80కి పైగా లాంచ్ ప్యాడ్స్, బంకర్ల ఏర్పాటు
  • అమెరికా లాంటి దేశాలు ముందస్తు దాడులు చేస్తే, అడ్డుకుని తిరిగి దాడి (Second-strike) చేసేందుకేనని నిపుణుల అంచనా
  • తాజా శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన డ్రాగన్ కంట్రీ భారీ వ్యూహం

China Nuclear Missile Sites | త్రినేత్ర.న్యూస్ : అగ్రరాజ్యం అమెరికాను ఢీకొట్టేందుకు చైనా (China) పక్కా వ్యూహంతో పావులు కదుపుతోంది. డ్రాగన్ కంట్రీ వాయువ్య ప్రాంతంలోని జిన్‌జియాంగ్ (Xinjiang) ఎడారిలో అత్యంత రహస్యంగా నిర్మిస్తున్న ఓ భారీ సైనిక స్థావరానికి సంబంధించిన షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. శాటిలైట్ చిత్రాల (Satellite images) ఆధారంగా రాయిటర్స్ వార్తాసంస్థ ఈ సంచలన నివేదికను బయటపెట్టింది. చైనా తన అత్యంత శక్తివంతమైన అణు క్షిపణులను దాచే 'సైలోస్' (Nuclear Silos) చుట్టూ భారీ సంఖ్యలో లాంచ్ ప్యాడ్స్, కమ్యూనికేషన్ నోడ్స్ నిర్మిస్తున్నట్లు ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

"ఇలాంటి భారీ ఎత్తున జరుగుతున్న నిర్మాణాలను నేనెప్పుడూ చూడలేదు.. ఇది చాలా అసాధారణమైన విషయం" అని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌కు చెందిన నిపుణుడు హన్స్ క్రిస్టెన్సెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అమెరికా కనుక చైనా అణు స్థావరాలపై 'ఫస్ట్ స్ట్రైక్' (మొదటి దాడి) చేస్తే.. దాన్ని తట్టుకుని దీటుగా బదులివ్వడానికే (Second-strike capability) బీజింగ్ ఈ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Satellite Pics Reveal Massive Chinese Launch Pads Near Nuclear Silos

శాటిలైట్ చిత్రాల్లో ఏముంది?

జిన్‌జియాంగ్‌ తూర్పు భాగంలోని హామీ (Hami) అణు క్షిపణి కేంద్రాలకు 140 నుంచి 230 కిలోమీటర్ల దూరంలో.. అష్టభుజి (Octagon) ఆకారంలో ఉన్న రెండు భారీ నిర్మాణాలను చైనా చేపట్టింది. వీటి చుట్టూ దాదాపు 80కి పైగా లాంచ్ ప్యాడ్స్‌ను (Launch pads) సిద్ధం చేసినట్లు తాజా చిత్రాల్లో వెల్లడైంది. ఇక్కడ మొబైల్ మిస్సైల్ లాంచర్లు, ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (Electronic warfare) వ్యవస్థలను మోహరించే అవకాశం ఉంది. సైనిక వాహనాలు, సిబ్బంది ఉండేందుకు అనువుగా ప్రత్యేకంగా బంకర్లను, ఆయుధాగారాలను కూడా నిర్మించారు.

Satellite Pics Reveal Massive Chinese Launch Pads Near Nuclear Silos

స్పేస్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్ల కోసం భారీ శాటిలైట్ డిష్‌లు, టవర్లను సైతం ఈ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాంచ్ ప్యాడ్స్‌ను కలుపుతూ ఎడారిలో ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ నెట్‌వర్క్‌ను వేసినట్లు నిపుణులు గుర్తించారు.

తైవాన్ టెన్షన్.. అమెరికా అలెర్ట్

చైనా అధికారికంగా 'నో ఫస్ట్ యూజ్' (No first use - మొదట దాడి చేయం) అణు విధానాన్ని పాటిస్తోంది. కానీ, తైవాన్ (Taiwan) విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే, వారిని బెదిరించడానికే అణ్వాయుధ సామర్థ్యాన్ని చైనా రక్షణ కవచంగా వాడుకోవచ్చని పాశ్చాత్య దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కూడా స్పందించారు. చైనా సైనిక విస్తరణ ఆందోళనకర స్థాయిలో ఉందని, ఆసియాలోని తమ మిత్ర దేశాలు రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Satellite Pics Reveal Massive Chinese Launch Pads Near Nuclear Silos

అమెరికాలోని ఏ నగరాన్నైనా ఇట్టే టార్గెట్ చేయగల లాంగ్-రేంజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ (ICBMs) చైనా వద్ద ఇప్పటికే ఉన్నాయి. సబ్‌మెరైన్లు, ఫైటర్ జెట్ల ద్వారా కూడా వీటిని ప్రయోగించగలదు. అయితే, శత్రు దేశాల దాడుల నుంచి ఆ మారణాయుధాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు జిన్‌జియాంగ్, గన్సు ప్రావిన్సుల్లో ఈ అత్యాధునిక అండర్‌గ్రౌండ్, బంకర్ నెట్‌వర్క్‌ను చైనా వేగంగా విస్తరిస్తోంది.

Advertisement
Advertisement