Lorna Hajdini | శృంగారానికి బానిస.. కోరిక తీర్చాలని లేడి బాస్ లైంగిక వేధింపులు
Lorna Hajdini | ఆమెకు శృంగారమంటే పిచ్చి.. పిచ్చి ఒక్కటే కాదు.. బానిసగా కూడా మారిపోయింది. ఇక తన కోరికలను తీర్చుకునేందుకు.. తన కంటే జూనియర్ అయిన సహోద్యోగిపై కన్నేసింది. నేను నీ బాస్‌ను.. నా కోరికలు తీర్చాల్సిందే.. లేదంటే కెరీర్ నాశనం చేస్తాను.. ప్రమోషన్ దక్కకుండా చేస్తానంటూ ఆ లేడి బాస్ తన జూనియర్‌ను లైంగికంగా వేధించింది.
International | Published On May 1, 2026, 1.26 pm IST
Lorna Hajdini | త్రినేత్ర.న్యూస్ : ఆమెకు శృంగారమంటే పిచ్చి.. పిచ్చి ఒక్కటే కాదు.. బానిసగా కూడా మారిపోయింది. ఇక తన కోరికలను తీర్చుకునేందుకు.. తన కంటే జూనియర్ అయిన సహోద్యోగిపై కన్నేసింది. నేను నీ బాస్‌ను.. నా కోరికలు తీర్చాల్సిందే.. లేదంటే కెరీర్ నాశనం చేస్తాను.. ప్రమోషన్ దక్కకుండా చేస్తానంటూ ఆ లేడి బాస్ తన జూనియర్‌ను లైంగికంగా వేధించింది. ఆమె ఆగడాలు భరించలేకపోయాడు. చివరకు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే లేడి బాస్‌కే వత్తాసు పలికారు. ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో రోడ్డున పడ్డ జూనియర్.. తనను మానసికంగా వేధించడంతో పాటు ఉద్యోగం కూడా కోల్పోయానని, పరిహారం ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు బాధిత వ్యక్తి.
జేపీ మోర్గాన్ ఛేజెస్ లేవరేజ్డ్ ఫైనాన్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోర్నే హజ్దినీ.. భారత సంతతికి చెందిన జూనియర్ సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. లైంగిక వేధింపులు, జాతి వివక్ష, వృత్తిపరమైన బలవంతానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ హజ్దినీపై జూనియర్ సహోద్యోగి న్యూయార్క్ కౌంటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
అసలేం జరిగిందంటే..?
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోర్నే హజ్దినీతో కలిసి భారత సంతతి జాన్ డో 2024 నుంచి కలిసి పని చేస్తున్నాడు. అయితే ఒక రోజు హజ్దిని ఉద్దేశపూర్వకంగా.. అతని డెస్క్ పక్కన ఓ పెన్ను పడేసింది. ఇక దాన్ని తీయడానికి ఆమె కిందకు వంగింది. రాణా కాలు రుద్దుతూ.. నువ్వు కాలేజీలో బాస్కెట్ బాల్ ఆడావా..? నాకు బాస్కెట్ బాల్ ఆటగాళ్లంటే చాలా ఇష్టమని.. అతన్ని ప్రేరేపించింది. మై లిటిల్ బ్రౌన్ బాయ్ అని పేర్కొంటూ.. బలవంతంగా డ్రగ్స్ ఇచ్చిన తన కోరికలు తీర్చాలని డిమాండ్ చేసేది. లేదంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించేది అని జాన్ డో పేర్కొన్నాడు.
2024 సెప్టెంబర్ నెలలో శృంగారం చేసేందుకు నిరాకరించడంతో.. మళ్లీ బెదిరింపులకు పాల్పడి.. యాజమాన్యం ఓ బ్రౌన్ బాయ్‌కు నాయకత్వం అప్పగిస్తుంది అనుకుంటున్నావా.. అని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి అవమానించింది. అంతేకాదు.. ఈ రాత్రికి నా కోరిక తీర్చకుంటే.. ప్రమోషన్ దక్కకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆమెకు బాధితుడు లొంగిపోయాడు. ఆమె గదికి వెళ్లిన తర్వాత రోహిప్నోల్ అనే డ్రగ్ బలవంతంగా ఇచ్చి.. కోరిక తీర్చుకుంది. డ్రగ్స్ ఇచ్చినట్లు ఆమె అంగీకరించిందని రాణా తెలిపాడు.
ఆమె ఆగడాలు రోజు రోజుకూ శ్రుతిమించడంతో బాధితుడు గతేడాది మేలో యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే, వీటిపై అంతర్గత విచారణ జరిపిన జేపీ మోర్గాన్.. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తోసిపుచ్చింది. అంతేకాదు, అతడ్ని సంస్థ ఉద్యోగం నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డాడు. ఇంతవరకూ ఉద్యోగం పొందలేకపోయాడు. కానీ, నిందితురాలు మాత్రం అదే సంస్థలో కొనసాగుతున్నారు. ఉద్యోగం దొరక్క ఆదాయం కోల్పోయి, మానసిక వేదన అనుభవిస్తున్నాడని, దీనికి పరిహారం ఇప్పించాలని బాధితుడి తరపు లాయర్ కోర్టును కోరారు.
ఎవరీ లోర్నే హజ్దినీ..?
లోర్నే హజ్దీని(37).. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ కాలేజీ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 2011లో జేపీ మోర్గాన్‌లో జాయిన్ అయ్యారు. అప్పట్నుంచి అక్కడే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.2021లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం లెవరేజ్డ్ ఫైనాన్స్ విభాగం ఈడీగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



