Crucifix | మరణం గురించి సందేశం ఇస్తుండగా.. సిలువ మీదపడి చర్చి ఫాదర్ మృతి
Crucifix | ఈక్వెడార్‌లోని (Ecuador) ఓ చర్చిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసులకు సందేశం ఇస్తుండగా గోడకున్న భారీ సిలువ (Crucifix) చర్చి ఫాదర్‌పై పడటంతో ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Oct 19, 2026, 11.09 am IST
Crucifix | త్రినేత్ర న్యూస్: ఈక్వెడార్‌లోని (Ecuador) ఓ చర్చిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసులకు సందేశం ఇస్తుండగా గోడకున్న భారీ సిలువ (Crucifix) చర్చి ఫాదర్‌పై పడటంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం (Livestreamed Mass) అవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 17న నైరుతి ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్(Nuestra Senora del Perpetuo Socorro) చర్చిలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడే ఉన్న భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి (Rev. Patricio Alfredo Sánchez Molinari) ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న వారికి సందేశం ఇస్తూ.. జీవితంలోని అనిశ్చితి, మరణం గురించి మాట్లాడారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా దేవుడికి, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు సమయం కేటాయించాలని సూచించారు. మనిషి జీవితం శాశ్వతం కాదని, ఇతర విషయాల కంటే దేవుడితో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సందేశమిచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఆయన వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ ఒక్కసారిగా ఊడిపడి తలపై భాగంలో బలంగా తాకింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A priest has reportedly been killed after a crucifix fell on him during a livestreamed church service in Ecuador. https://t.co/z6SWkTjrGM
— Bonaya Happi (@BonayaHappi) October 19, 2026
సంబంధిత వార్తలు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
ఆగస్టు 20, 2026

Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా
జూన్ 26, 2026

Hanuman Chalisa Recitation | ఓవైపు చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. మరోవైపు పక్కనే హనుమాన్ చాలిసా పఠనం
డిసెంబర్ 25, 2025
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..
- ●Revanth Reddy | నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన.. పోలీస్ కమిషనరేట్ ప్రారంభం
- ●Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా సబ్ఇన్స్పెక్టర్లు బదిలీ.. సీపీ సజ్జనర్ ఉత్తర్వులు
- ●Samsung Galaxy F70 5G | శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జి లాంచ్.. ధర రూ.17,999 నుంచే..
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ర్యాలీ కొనసాగేనా..?
- ●PV Sindhu | వెండి బతుకమ్మతో పీవీ సింధు.. నెటిజన్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..

Revanth Reddy | నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన.. పోలీస్ కమిషనరేట్ ప్రారంభం

Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా సబ్ఇన్స్పెక్టర్లు బదిలీ.. సీపీ సజ్జనర్ ఉత్తర్వులు

Samsung Galaxy F70 5G | శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జి లాంచ్.. ధర రూ.17,999 నుంచే..



