Israel Gaza War | గాజాపై ట్రంప్ ‘పీస్ ప్లాన్’కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు
గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15-అంశాల శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. హమాస్ ఆయుధాలు వీడేవరకు తగ్గేదే లేదని నెతన్యాహు తేల్చిచెప్పారు.
International | Published On Aug 9, 2026, 5.15 pm IST
- ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల గాజా 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్
- హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టేంత వరకు ఐడీఎఫ్ (IDF) దళాలు వెనక్కి రావని స్పష్టం చేసిన ప్రధాని నెతన్యాహు
- అమెరికా మద్దతున్న ఈ ప్లాన్ అమలుకు, ఆయుధాలు అప్పగించేందుకు తాము సిద్ధమేనని ప్రకటించిన హమాస్
- ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేసిన యూఏఈ సహా 8 ముస్లిం దేశాలు
Israel Gaza War | త్రినేత్ర.న్యూస్ : గాజా స్ట్రిప్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15-అంశాల శాంతి ప్రణాళికకు (15-point peace plan) ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఈ ప్లాన్‌ను తాము తిరస్కరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కుండబద్దలు కొట్టారు. హమాస్ (Hamas) పూర్తిగా ఆయుధాలను విడిచిపెట్టే వరకు తమ సైన్యం గాజా నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
అప్పటిదాకా వెనక్కి తగ్గం: నెతన్యాహు
"ఈ 15-పాయింట్ల డాక్యుమెంట్‌ను ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ (Disarmament) జరిగేంత వరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఏమాత్రం వెనక్కి తగ్గవు. మా దళాలపై, మా పౌరులపై ఉన్న ముప్పును తిప్పికొట్టడం కొనసాగిస్తూనే ఉంటాం" అని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఒప్పందానికి సిద్ధమన్న హమాస్
మరోవైపు, అమెరికా మద్దతు ఇస్తున్న ఈ శాంతి ఒప్పందాన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ శనివారం ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరింది. ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్' సూచించిన తాజా దశకు తాము కట్టుబడి ఉన్నామని హమాస్ తెలిపింది. ఈ ప్లాన్ ప్రకారం.. గాజాలో కొత్తగా ఏర్పడే పాలక కమిటీకి హమాస్ తమ ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది.
"మధ్యవర్తుల ద్వారా కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడానికి, రెండో ఫేజ్‌కు (Phase 2) వెళ్లడానికి హమాస్ సిద్ధంగా ఉంది. అయితే ఇజ్రాయెల్ కూడా దీనికి అంగీకరించి.. ప్లాన్‌ను అమలు చేయడం ప్రారంభించాలి" అని ఒక హమాస్ అధికారి ఏఎఫ్‌పీ (AFP) న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
ఇజ్రాయెల్ తీరుపై ముస్లిం దేశాల ఫైర్
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో సహా ఎనిమిది ముస్లిం మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా ఖండించాయి. గాజాలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు.. ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరింత కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
అక్టోబర్ 19, 2026

Smit Machchhar | యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు
అక్టోబర్ 4, 2026

Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు
- ●Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య
- ●Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!
- ●Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!
- ●Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య

Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..

అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!



