Gunfire | ట్రంప్ విందు కార్యక్రమంలో కాల్పులు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యలు వైరల్..!
Gunfire | వైట్‌హౌస్ విందులో కాల్పుల కలకలం చోటుచేసుకోగా, ట్రంప్ ప్రెస్ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం వేరైనప్పటికీ.. కాల్పుల ఘటనతో ముడిపెడుతూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
International | Published On Apr 26, 2026, 5.47 pm IST
Gunfire | అమెరికాలో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరైన ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. దాంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యారు. అయితే, కార్యక్రమానికి ముందు ట్రంప్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోలిన్ మాట్లాడుతూ ట్రంప్ ప్రసంగం ఉత్సాహంగా ఉండబోతోందుని.. ఈ రాత్రి కొన్ని షాట్స్ వినిపిస్తాయంటూ వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్య వెనుక ఉద్దేశం ట్రంప్ ప్రసంగం ఆకర్షణీయంగా ఉండబోతుందని అయినా.. కాల్పుల ఘటనతో ఆ వ్యాఖ్యలకు కొత్త అర్థాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు.
భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, ఆ అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే స్పందించి ట్రంప్‌ను భద్రతా వలయంలోకి తీసుకుని వేదిక వెనుక భాగం ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఇక లీవిట్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం జరిగిన కాల్పుల ఘటన మధ్య ఉన్న యాదృచ్ఛిక పోలికపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🔥 Karoline Leavitt calls on everyone to watch tonight because Donald Trump will bring the heat and there will be “shots fired” pic.twitter.com/U5fqLd8Ydw
— Vlad Posts (@ANN_News92) April 25, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






