Mojtaba Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ!
Mojtaba Khamenei | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎంపికయ్యారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఫిబ్రవరి 28న చనిపోయిన విషయం తెలిసిందే.
International | Published On Mar 4, 2026, 7.03 am IST
Mojtaba Khamenei | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎంపికయ్యారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఫిబ్రవరి 28న చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (Assembly of Experts) కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన కుమారుల్లో ఒకరైన మొజ్తబాను ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఇరాన్ ఇంర్నేషనల్ వెల్లడించింది. మొజ్తబా ఎంపిక వెనుక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రభావం ఉన్నట్లు సమాచారం. తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తబాను ఎంపికచేయాలని మతపరమైన వ్యక్తులతో నిండి ఉన్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పై ఐఆర్‌జీసీ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది.
ఎవరీ మొజ్తబా..
మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా కుమారుల్లో ఒకరైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ 1969లో మషహద్‌లో జన్మించారు. ఆయనకు గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం లేదు. కానీ షియా మత ప్రబోధకుడిగా మొజ్తబాకు పేరుంది. మతపరమైన వాతావరణంలో విద్యనభ్యసించిన మొజ్తబా.. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో రివల్యూషనరీ గార్డ్స్‌తో కలిసి పనిచేశారు. ఆయన చాలా కాలం నుంచి తన తండ్రికి పరిపాలనలో సలహాలు ఇచ్చేవారని, తెర వెనుక ఉండి అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రచారంలో ఉంది. ఇప్పటివరకూ ఎటువంటి పెద్ద ప్రభుత్వ పదవిని చేపట్టనప్పటికీ, సైన్యంతో పాటు పారా మిలిటరీ బలగాలతో మొజ్తబాకు మంచి సంబంధాలు ఉన్నాయి.
2009 నిరసనల సమయంలో తెరపైకి..
2006లో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో మొజ్తబా పేరు చర్చలోకి వచ్చింది. నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరిస్తారని దేశంలో రాజకీయ చర్చ మొదలైంది. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం సమయంలో వంశపారంపర్యంగా అధికారాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అందువల్ల, ఆయన ఎంపికపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఖమేనీ కుమారుడికి సుప్రీం లీడర్ పదవిని అప్పగిస్తే, మతపెద్దల కమిటీపై ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చనే అంచనాలున్నాయి. ఖమేనీ కుటుంబ వారసత్వాన్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే, ఇరాన్‌లోకి మళ్లీ రాచరికాన్ని తెచ్చినట్టు అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా పేర్కొంటున్నారు.
సుప్రీం లీడర్ పదవి ఎంత ముఖ్యమైనది?
ఇరాన్‌లో సుప్రీం లీడర్ అనేది దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవి. సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా, విదేశీ విధానంతో పాటు ప్రధాన వ్యూహాత్మక నిర్ణయాలపై తుది అధికారం సుప్రీం లీడర్‌కు ఉంటుంది. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపిస్తారు, కానీ తుది నియంత్రణ సుప్రీం లీడర్ వద్దే ఉంటుంది. అందువల్ల సుప్రీం లీడర్ మరణిస్తే, అధికార మార్పిడి ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.
సంబంధిత వార్తలు

Iran-US tensions | అమెరికాను ఓడించేందుకు నేవీ సిద్ధంగా ఉంది : మొజ్తాబా ఖమేనీ
ఏప్రిల్ 18, 2026

US-Iran Conflict | యుద్ధం కొనసాగితే ఎవరూ ఊహించని ఆయుధాలతో దాడులు.. అమెరికాకు ఐఆర్‌జీసీ వార్నింగ్..!
ఏప్రిల్ 14, 2026

Mojtaba Khamenei | కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు : మొజ్తాబా ఖమేనీ
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



