త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | మ‌. 3 గంట‌ల‌కు కేసీఆర్ విచార‌ణ‌.. బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌( KCR )ను ఫిబ్ర‌వ‌రి 1న సిట్‌( SIT ) విచారించ‌నున్న‌ నేప‌థ్యంలో బంజారాహిల్స్ ప‌రిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) విధించారు.

S

Hyderabad | Published On Feb 1, 2026, 12.01 am IST

Traffic Restrictions | మ‌. 3 గంట‌ల‌కు కేసీఆర్ విచార‌ణ‌.. బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌( KCR )ను ఫిబ్ర‌వ‌రి 1న సిట్‌( SIT ) విచారించ‌నున్న‌ నేప‌థ్యంలో బంజారాహిల్స్ ప‌రిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) విధించారు. ముఖ్యంగా నందిన‌గ‌ర్( Nandinagar ) ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్నారు. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల నుంచి విచార‌ణ ముగిసే వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ఇందుకు స్థానికులు, వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు.

ఈ ప్రాంతాల్లోనే వాహ‌నాల నిలిపివేత‌

1. నందిన‌గ‌ర్ బ‌స్టాప్
2. నంది న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్
3. జేసీ రెడ్డి చికెన్ సెంట‌ర్
4. యూనియ‌న్ బ్యాంక్ బై లేన్
5. బ‌స‌వ‌తార‌కం రోట‌రీ
6. అగ్ర‌సేన్ జంక్ష‌న్
7. టీఎస్ స్ట‌డీ స‌ర్కిల్
8. ఎన్టీఆర్ భ‌వ‌న్
9. ఎమ్మార్సీ క‌మాన్, రోడ్ నంబ‌ర్ 12
10. సాగ‌ర్ సొసైటీ టీ జంక్ష‌న్

Advertisement
Advertisement