T20 World Cup | లంక అలవోక విజయం
T20 World Cup | టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఒమన్‌తో పోటీ పడిన శ్రీలంక అలవోక విజయం సాధించింది. ఒమన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ మ్యాచ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ బీలో అగ్రస్థానానికి లంక చేరగా, రెండూ ఓడి ఒమన్ చివరిస్థానానికి దిగజారింది.
Flash news | Published On Feb 12, 2026, 5.58 pm IST
ఏ దశలోనూ పోటీ ఇవ్వని ఒమన్
T20 World Cup | త్రినేత్ర.న్యూస్: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఒమన్‌తో పోటీ పడిన శ్రీలంక అలవోక విజయం సాధించింది. ఒమన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ మ్యాచ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ బీలో అగ్రస్థానానికి లంక చేరగా, రెండూ ఓడి ఒమన్ చివరిస్థానానికి దిగజారింది.
టాస్ గెలిచిన ఒమన్ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, శ్రీలంక 42 పరుగులకే ఓపెనర్‌లు ఇద్దరినీ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60) విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రత్నాయకే ఔట్ అవడంతో క్రీజ్‌లోకి వచ్చిన దాసన్ శనక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లో 50 పరుగులు చేసి నిష్క్రమించాడు. 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక అయిదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు సాధించింది. జీతెన్ రామనంది రెండు వికెట్లు తీయగా, జయ్ ఒడెద్రా, సుఫియాన్ మహమూద్ చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 12 పరుగులకే ఓపెనర్‌లు ఇద్దరూ ఔటయ్యారు. తొమ్మిది పరుగులే చేసి హమ్మద్ మీర్జా సైతం వెనుదిరిగాడు. ఈ దశలో వసీమ్ అలీ (20 బంతుల్లో 27 పరుగులు)తో కలిసి మహమ్మద్ నదీమ్ (56 బంతుల్లో 53 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వసీమ్ అవుటవడంతో లోయర్ ఆర్డర్ అంతా పేకమేడలా కుప్పకూలింది. నిర్దేశిత 20 ఓవర్లకు గాను ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. చమీర, తీక్షణ చెరో రెండు వికెట్లు, వెల్లలాగె, హేమంత, మెండిస్ తలా ఒక వికెట్ చొప్పన సాధించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TOMCOM | తెలంగాణ పిల్లలకు ఓమన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 73 వేల జీతం.. వివరాలివే..!
ఏప్రిల్ 30, 2026

IPL 2026 | బ్రైడన్ కార్సీ అవుట్.. మధుషంక ఇన్.. హైదరాబాద్ జట్టులోకి శ్రీలంక బౌలర్..!
ఏప్రిల్ 15, 2026

Mann Ki Baat | రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..!
మార్చి 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



