Geetu Mohandas | యశ్ టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఇదే!
యశ్ టాక్సిక్ మూవీ డైరెక్టర్ తెలుగులో ఓ సినిమా చేసింది. అది కూడా హీరోయిన్‌గా. వేణు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఆ మూవీ ఏదంటే?
Entertainment | Published On Feb 26, 2026, 3.20 pm IST
యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా బజ్ నెలకొంది. సాండల్‌వుడ్, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజైన టాక్సిక్ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇందులోని ఇంటిమేట్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్, వయలెన్స్ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఓ లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం ఏంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. తన నుంచి సాఫ్ట్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేసిన ఆడియెన్స్‌కు మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పెద్ద షాకిచ్చింది. ఆమె టేకింగ్‌కు ఆర్‌జీవీ లాంటి డైరెక్టర్లు సైతం విస్మయానికి లోనయ్యారు. టాక్సిక్ గ్లింప్స్, టీజర్‌పై ప్రశంసలతో పాటు అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆమెపై మహిళా కమీషన్‌లో కంప్లైంట్ కూడా నమోదు అయ్యింది.
మూడో సినిమా...
కేజీఎఫ్ బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు ఆసక్తిని చూపించారు. కానీ వారందరిని కాదని గీతూ మోహన్ దాస్‌కు అతడు ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. గీతూ మోహన్‌దాస్‌కు దర్శకురాలిగా ఇది మూడో సినిమా మాత్రమే. బాలీవుడ్ మూవీ లయర్ డైస్‌తో డైరెక్టర్‌గా మారింది గీతూమోహన్ దాస్. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన ఈ మూవీ రెండు నేషనల్ అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో మూథన్ అనే సినిమా చేసింది.
తెలుగులో...
ఈ రెండు సినిమాల కంటే ముందు హీరోయిన్‌గా తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది గీతూ మోహన్ దాస్. అంతే కాదు తెలుగులో ఓ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతోటాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు రాలేదు.
వేణు వీడెక్కడి మొగుడండి...
వేణు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన వీడెక్కడి మొగుడండి సినిమాలో శృతి రాజ్‌తో కలిసి గీతూ మోహన్ దాస్ మరో నాయికగా కనిపించింది. ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేసింది. ఈవీవీ హవా నడుస్తోన్న టైమ్‌లో 2001లో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈవీవీ స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ కమర్షియల్‌గా సరైన విజయాన్ని సాధించలేదు. ఈ డిజాస్టర్ కారణంగా మళ్లీ తెలుగులో సినిమా చేయలేకపోయింది గీతూ మోహన్ దాస్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






