త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Horror OTT | 50 కోట్ల బ‌డ్జెట్ – 455 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే హార‌ర్ మూవీ

కంజూరింగ్ ఫ్రాంచైజ్‌లో రూపొందిన చివ‌రి మూవీ ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. కేవ‌లం యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 455 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

N

Entertainment | Published On Jan 29, 2026, 1.17 pm IST

Horror OTT | 50 కోట్ల బ‌డ్జెట్ – 455 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే హార‌ర్ మూవీ
Advertisement

Horror OTT | ది కంజూరింగ్ హాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హార‌ర్ మూవీ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. హార‌ర్ ఎలిమెంట్స్‌కు ఊహ‌ల‌కు అంద‌ని మ‌లుపుల‌ను జోడిస్తూ తెర‌కెక్కిన ఈ సినిమాలు ఆడియెన్స్‌ను భ‌య‌పెట్ట‌డ‌మే కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్ప‌టివ‌ర‌కు ది కంజూరింగ్ సిరీస్‌లో నాలుగు సినిమాలు వ‌చ్చాయి. నాలుగో భాగం ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైంది. కేవ‌లం యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ హార‌ర్‌ మూవీ 455 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. 2025లో అత్య‌ధిక లాభాల‌ను ద‌క్కించుకున్న హాలీవుడ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ఓటీటీలోకి...

తాజాగా ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది. ఈ హార‌ర్ మూవీ ఫిబ్ర‌వ‌రి 13 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్‌ మూవీ అందుబాటులో ఉంది. అయితే రెంట‌ల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో ఫిబ్ర‌వ‌రి 13 నుంచి ఫ్రీగా ఈ హార‌ర్ సినిమాను చూడొచ్చు.  జియో హాట్ స్టార్ లో తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

ఇదే చివ‌రి మూవీ...

ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమాలో పాట్రిక్ విల‌న్స్‌, వేరా ఫార్మిగా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. గ‌త మూడు పార్ట్‌ల‌లో మాదిరిగానే ఇందులోనూ ఎడ్ వారెన్‌, లొరైన్ క్యారెక్ట‌ర్స్‌లో వీరిద్ద‌రు క‌నిపించారు. కంజూరింగ్ ఫ్రాంచైజ్‌లో ఎడ్ వారెన్‌, లొరైన్ పాత్ర‌ల‌తో రూపొందిన చివ‌రి మూవీ ఇదేన‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఒక‌పై కంజూరింగ్ సిరీస్‌లో వీరి రోల్స్ క‌నిపించ‌వ‌ని వెల్ల‌డించారు.

ట్విస్ట్‌లు...ట‌ర్న్‌ల‌తో...

గ‌త పార్ట్‌ల‌కు మించిన ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించింది. త‌మ‌కున్న సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ఎన్నో అతీంద్రియ శ‌క్తుల‌ను ఎదుర్కొంటారు పారానార్మ‌ల్ ఇన్వేస్టిగేట‌ర్స్‌ ఎడ్‌, లొరైన్‌. వారి కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఒక‌టి వ‌స్తుంది. ఓ విల్లా వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో దుష్ట ఆత్మ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ ఆత్మ కార‌ణంగా ఎడ్‌, లొరైన్ జీవితాలు ఎలా ప్ర‌మాదంలో ప‌డ్డాయి? ఆ ఆత్మ‌ను వారు బంధించారా? లేదా? అన్న‌దే ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement