త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonakshi Sinha | భార్య హీరోయిన్ – భ‌ర్త విల‌న్ – పెళ్లి త‌ర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ

భ‌ర్త జ‌హీర్ ఇక్బాల్‌తో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తూ హై మేరీ కిర‌ణ్ పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది. క‌ర‌ణ్ రావ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ హిందీ మూవీ అక్టోబ‌ర్ 23న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా...ఆమె భ‌ర్త జ‌హీర్ ఇక్బాల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 6, 2026, 3.24 pm IST

Sonakshi Sinha | భార్య హీరోయిన్ – భ‌ర్త విల‌న్ –  పెళ్లి త‌ర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Sonakshi Sinha |  భ‌ర్త జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) తో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తోంది. తూ హై మేరీ కిర‌ణ్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు క‌ర‌ణ్ రావ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్టోబ‌ర్ 23న ఈ బాలీవుడ్ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

రియ‌ల్ లైఫ్ క‌పుల్‌...

ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా...ఆమె భ‌ర్త జ‌హీర్ ఇక్బాల్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. రియ‌ల్‌లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన వీరిద్ద‌రు రీల్‌లైఫ్‌లో శ‌త్రువులుగా న‌టిస్తుండ‌టం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్రైల‌ర్ రిలీజ్‌...

తూ హై మేరీ కిర‌ణ్ ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం రిలీజైంది. కిర‌ణ్‌తో అనే యువ‌తితో ప‌రిచ‌యాన్ని ప్రేమ‌గా అపోహ‌ప‌డ‌తాడు స‌మ‌ర్ అనే యువ‌కుడు. కిర‌ణ్ మాత్రం అత‌డి ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌ను రిజెక్ట్‌ చేస్తుంది. దాంతో సైకోగా మారిన స‌మ‌ర్ త‌న‌ను ప్రేమించాల్సిందే అంటూ కిర‌ణ్‌ను వేధింపుల‌కు గురిచేస్తాడు. ఆమెను నీడ‌లా వెంటాడుతాడు. స‌మ‌ర్ వేధింపుల కార‌ణంగా కిర‌ణ్ ఎలాంటి ఇబ్బందులు ప‌డింద‌నే అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సైకో పాత్ర‌లో జ‌హీర్ ఇక్బాల్ డైలాగ్ డెలివ‌రీ, న‌ట‌న‌, పాత్ర‌లో వేరియేష‌న్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

డ‌ర్ స్ఫూర్తితో...

షారుఖ్‌ఖాన్ విల‌న్‌గా న‌టించిన డ‌ర్ మూవీ స్ఫూర్తితో తూ హై మేరీ కిర‌ణ్ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. డ‌ర్‌లో షారుఖ్‌ఖాన్‌ను పోలి జ‌హీర్ ఇక్బాల్ పాత్ర సాగింది.పెళ్లి త‌ర్వాత సోనాక్షి సిన్హా, జ‌హీర్ ఇక్బాల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. పెళ్లికి ముందు వీరిద్ద‌రు క‌లిసి డ‌బుల్ ఎక్స్ఎల్ అనే సినిమా చేశారు. 2024లో సోనాక్షి సిన్హా, జ‌హీర్ ఇక్బాల్ పెళ్లిచేసుకున్నారు. వివాహానికి ముందు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమ‌లో ఉన్నారు. స‌ల్మాన్‌ఖాన్‌కు స‌న్నిహితుడైన జ‌హీర్ నోట్‌బుక్‌తో పాటు రుస్లాన్ సినిమాలు చేశాడు.

తెలుగులో...

మ‌రోవైపు పెళ్లి త‌ర్వాత సోనాక్షి సిన్హాకు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త ఏడాది జ‌టాధ‌ర‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇటీవ‌లే సిస్ట‌మ్ పేరుతో కోర్ట్ రూమ్ డ్రామా మూవీ చేసింది సోనాక్షి సిన్హా. నేరుగా ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.

 

Advertisement
Advertisement