Ram Charan | రామ్‌చరణ్ పహిల్వాన్ లుక్ వెనక ఉన్న సీక్రెట్ ఇదే – ఎనిమిది నెలలు కఠిన శిక్షణ
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇందులో పహిల్వాన్‌గా రామ్‌చరణ్ రగ్గ్‌డ్ లుక్, మేకోవర్ అయిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. ఈ పహిల్వాన్ లుక్ కోసం రామ్‌చరణ్ ఎనిమిది నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారట.
Entertainment | Published On Mar 29, 2026, 3.08 pm IST
Ram Charan | రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా పెద్ది మూవీ నుంచి ఇటీవల ఓ స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇందులో పహిల్వాన్‌గా రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు రామ్‌చరణ్. మల్లయోధుడిగా రామ్‌చరణ్ మేకోవర్ , ట్రాన్స్‌ఫర్మేషన్ ఆకట్టుకున్నాయి. ఆటే నా పొగరు అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతోన్నారు.ఈ గ్లింప్స్‌తో పెద్ది సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. పహిల్వాన్ లుక్ వెనుక రామ్‌చరణ్ ఎనిమిది నెలలు కష్టం ఉందట. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సానా రివీల్ చేశారు.
స్పెషల్ ట్రైనింగ్...
"పహిల్వాన్ పాత్ర గురించి చెప్పగానే రామ్‌చరణ్ ఎగ్జైట్ అయ్యారు. ఈ పాత్రకు తగ్గ ఫిజిక్ కోసం చరణ్ చాలా కష్టపడ్డారు. దాదాపు ఎనిమిది నెలలు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండటంతో ఈ ట్రైనింగ్ టైమ్‌లో కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నారు. నాన్ వెజ్ పూర్తిగా దూరం పెట్టారు. వర్కవుట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఒక్క రోజు కూడా మిస్ చేయలేదు. మేము ఊహించిన దానికంటే ఫాస్ట్‌గానే పహిల్వాన్ లుక్‌ను సాధించారు. సినిమాలో కుస్తీ ఫైట్ సీన్లు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ను తెప్పిస్తాయి" అని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అన్నారు.
స్పెషల్ సాంగ్ మినహా...
స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న పెద్ది మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఓ స్పెషల్ సాంగ్ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఈ ప్రత్యేక గీతాన్ని షూట్ చేయబోతున్నారట. ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. పెద్ది మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర తర్వాత జాన్వీ చేస్తోన్న సెకండ్ తెలుగు మూవీ ఇది.
నాలుగు వందల కోట్ల బడ్జెట్...
కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాదు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ది మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే వల్ల ఎప్రిల్ 30కి వాయిదాపడింది.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్కకు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్షన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా!
మే 16, 2026

Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో చేతికి బ్యాండేజ్‌తో రామ్ చరణ్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
మే 15, 2026

Peddi | ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్‌చరణ్ పెద్ది ప్రమోషన్స్ – పాన్ ఇండియన్ లెవెల్లో ఈవెంట్స్…
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



