త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి తెలుగు హార‌ర్ మూవీ – క్షుద్ర విద్యల క‌థ‌ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో…

తెలుగు హార‌ర్ మూవీ హ‌నీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌స్తుంది. న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 27 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 21, 2026, 6.09 pm IST

OTT | ఓటీటీలోకి తెలుగు హార‌ర్ మూవీ – క్షుద్ర విద్యల క‌థ‌ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో…
Advertisement

OTT |  న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ హ‌నీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ ఏవ‌న్న‌ది గురువారం రివీల‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 27న స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ హ‌నీ విడుద‌ల కానున్న‌ట్లు స‌న్ నెక్స్ట్ ప్ర‌క‌టించింది. ఇందులో న‌వీన్‌చంద్ర‌తో పాటు దివ్య పిళ్లై, బిగ్‌బాస్ దివి, రాజా ర‌వీంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప‌లాస 1978, మ‌ట్కా సినిమాల ఫేమ్ క‌రుణ కుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇర‌వై రోజుల గ్యాప్‌...

ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన హ‌నీ మూవీ ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. పిల్లి మాయ అనే క్షుద్ర విద్య నేప‌థ్యంలో సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో న‌వీన్ చంద్ర నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్నా దానిని ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ త‌డ‌బ‌టం, ప్రెడిక్ట‌బుల్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా హ‌నీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఈ సినిమా ర‌న్ టైమ్ రెండు గంట‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

హ‌నీ క‌థ ఇదే...

ఆనంద్ త‌న గురువు సారంగ‌పాణితో క‌లిసి తాంత్రిక పూజ‌లు చేస్తుంటాడు. పిల్లి మాయను విక్ర‌యించి కోట్లు గ‌డించాల‌ని అనుకుంటాడు. ఈ క్షుద్ర పూజ కోసం త‌న కూతురు మీరాతో పాటు భార్య ల‌లిత‌ను ఓ ఇంట్లో బందీగా ఉంచుతాడు? ఆనంద్ పూజ‌ల కార‌ణంగా మీరా, ల‌లిత ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు? ఆనంద్ ల‌క్ష్యం నెర‌వేరిందా? వీరి జీవితాల్లోకి వ‌చ్చిన ర‌వ‌ణ‌( దివి) ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
హ‌నీ కంటే ముందు...
హ‌నీ కంటే ముందు ప‌లాస 1978, మ‌ట్కాతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్‌. మ‌రోవైపు హీరోగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు చేస్తున్నాడు న‌వీన్ చంద్ర‌. మ‌రోవైపు విల‌న్‌గా కూడా న‌టిస్తున్నాడు. తెలుగు, త‌మిళంతో పాటు క‌న్న‌డంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Advertisement
Advertisement