త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Israel War | ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన బెస్ట్ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు ఇవే

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధంతో ప‌శ్చిమాసియా మొత్తం వ‌ణికిపోతుంది. ఈ దాడుల‌తో గ‌ల్ఫ్ దేశాల్లో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కాగా ఈ రెండు దేశాల మ‌ధ్య శ‌త్రుత్వానికి గ‌ల కార‌ణాలు, విభేదాల‌పై అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వ‌చ్చాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Mar 1, 2026, 3.33 pm IST

Iran Israel War |   ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన బెస్ట్ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు ఇవే
Advertisement

Iran Israel War |  ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం ప్ర‌పంచ దేశాల‌ను కుదిపేస్తోంది. రెండు దేశాల మ‌ధ్య మొద‌లైన ఈ వార్ ఇప్పుడు గ‌ల్ఫ్ దేశాల‌కు మొత్తం విస్త‌రించింది. ఇరాన్‌ను ల‌క్ష్యంగా చేసుకొని అమెరికాతో క‌లిసి ఇజ్రాయెల్ దాడుల‌కు దిగింది. ప్ర‌తీకారంతో ర‌గిలిపోతున్న ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా క్షిప‌ణి దాడులు చేస్తోంది. ఈ యుద్ధం మూడో వ‌ర‌ల్డ్ వార్‌కు దారి తీయ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అస‌లు ఈ యుద్ధం ఎందుకు? ఎలా మొద‌లైంద‌నే దానిపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతోన్నాయి.ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య విభేదాలు ఇప్ప‌టివీ కాదు. 1979 నుంచి రెండు దేశాల మ‌ధ్య అంత‌ర్యుద్దం జ‌రుగుతూనే ఉంది. ఈ దేశాల మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వం, రాజ‌కీయ‌, సామాజిక ప‌ర‌మైన విభేదాల‌తో పాటు ఏళ్లుగా కొన‌సాగుతోన్న యుద్ధం నేప‌థ్యంలో హాలీవుడ్‌తో పాటు ప‌లు భాష‌ల్లో చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వ‌చ్చాయి. ఈ రెండు దేశాల మ‌ధ్య ఉన్న వైరానికి సంబంధించిన కార‌ణాల‌ను ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో ఆయా ద‌ర్శ‌కులు వివ‌రంగా ఆవిష్క‌రించారుఉ. ఆ సిరీస్‌లు, సినిమాలు ఏవంటే?

అటామిక్ ఫ‌లాఫెల్

2015లో రిలీజైన ఈ పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ మూవీ ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇరాన్‌పై అణుదాడి చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్స్ చేస్తుంటుంది. మ‌రోవైపు ఇరాన్ కూడా ప్ర‌తిదాడుల‌కు ర‌హ‌స్యంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటుంది. అణుక‌ర్మాకారం స‌మీపంలో ఉండే నోఫ‌ర్ అనే ఇజ్రాయిల్ యువ‌తికి ఇరాన్ అమ్మాయితో ఫేస్‌బుక్ ద్వారా స్నేహం ఏర్ప‌డుతుంది. రెండు దేశాల మ‌ధ్య యుద్ధాన్ని ఆప‌డానికి వారు ఏం చేశార‌నే అంశాల‌తో ఈ సినిమా సాగుతుంది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వాన్ని ఫ‌న్నీగా ఈ మూవీలో చూపించారు.

ది ఆప‌రేటివ్‌...

ఇరాన్‌...ఇజ్రాయెల్ మ‌ధ్య అటామిక్ వార్‌కు ప్రేమ‌క‌థ‌ను జోడించి ది ఆప‌రేటివ్ మూవీ రూపొందింది. రాచెల్ అనే మహిళను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ నిమిత్తం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు పంపిస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాల వివ‌రాల‌ను ఇజ్రాయెల్‌కు ర‌హ‌స్యంగా చేరేవేసే ప‌నిమీద వెళ్లిన రాచెల్ అనుకోకుండా ఇరాన్ వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డుతుంది? ఆ త‌ర్వాత ఏమైంది? గూఢ‌చారి అనే నిజం ఇరాన్ అధికారుల‌కు తెలిసిందా అనే అంశాల‌తో ది ఆప‌రేటివ్ మూవీ రూపొందింది.

టెహ్రాన్ వెబ్ సిరీస్

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై వ‌చ్చిన వ‌న్ ఆఫ్ ది బెస్ట్ వెబ్‌సిరీస్‌గా టెహ్రాన్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. తామర్ రాబిన్యాన్ అనే ఇజ్రాయెలీ ఇజ్రాయెల్ హ్యాక‌ర్ ఇరాన్ లోని అణు రియాక్టర్‌ను ధ్వంసం చేసే లక్ష్యంతో రహస్యంగా టెహ్రాన్‌లోకి ప్రవేశిస్తుంది. అనుకోకుండా తామ‌ర్ గురించి ఇరాన్ మిల‌ట్రీ ఆఫీసర్ ఫరాజ్ కమాలి (షాన్ టౌబ్) కి తెలుస్తుంది. ఆమెను ప‌ట్టుకోవ‌డానికి త‌న అనుచ‌రుల‌తో రంగంలోకి దిగుతాడు? శ‌త్రుదేశంలో త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి తామ‌ర్ ఏం చేసింద‌నే అంశాల‌ను థ్రిల్లింగ్‌గా ఈ సిరీస్‌లో చూపించారు మేక‌ర్స్‌.

రీటా జహాన్ ఫరూజ్

ఇజ్రాయిల్ సింగ‌ర్ రీటా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డాక్యుమెంట‌రీ అప్ప‌ట్లో అనేక వివాదాల‌ను సృష్టించింది. ఇజ్రాయెల్‌లో ఫేమ‌స్ సింగ‌ర్‌గా గుర్తింపును పొందిన రీటా స్వ‌స్థ‌లం ఇరాన్‌. త‌ల్లిదండ్రులు చిన్న‌త‌నంలోనే ఇజ్రాయెల్‌కు వ‌ల‌స వ‌స్తారు. ఇజ్రాయెల్‌లో ఉన్న రీటా మాతృభూమి కోసం ఏం చేసింది? రెండు దేశాల మ‌ధ్య ఉన్న‌ రాజ‌కీయ శ‌త్రుత్వానికి కార‌ణాలేమిట‌నే అంశాల‌తో ఈ డాక్యుమెంట‌రీ రూపొందింది.

ఫౌడా వెబ్ సిరీస్‌....

టెహ్రాన్ మేక‌ర్స్ రూపొందించిన ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. గ‌ల్ఫ్ దేశాల డిఫెన్స్ వ్య‌వ‌స్థ ఎలా ప‌నిచేస్తున్నాయ‌న్న‌ది క్షుణ్ణంగా ఈ సిరీస్‌లో చూపించారు.

మిస్పైల్స్ ఓవ‌ర్ బ‌జాన్‌

హీబ్రూ భాష‌లో రూపొందిన ఫ‌స్ట్ ఇరానియ‌న్ డాక్యుమెంట‌రీ ఇది. 2025లో ఇరాన్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య 12 రోజుల పాటు జ‌రిగిన యుద్ధాన్ని, దాని తాలూకు ప‌రిణామాల‌ను ఈ డాక్యుమెంట‌రీలో చూపించారు. అయిల్ రిఫైన‌రీల‌పై క్షిప‌ణిదాడులు జ‌రిగితే ఎలాంటి వినాశ‌నం జ‌రుగుతుంది? కోట్లాది ప్రాణాలు ఎలా ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌న్న‌ది ఇందులో చూపించారు.
ది ఆర్గో, ఏంజెల్‌, ది ఇంపాజిబుల్ స్పై, ఫాల్స్ ఫ్లాగ్‌, రీమేకింగ్ ది మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్ వ‌ర్సెస్ ఇరాన్‌, బిఫోర్ ది రివాల్యూష‌న్‌తో ప‌లు సినిమాలు,  సిరీస్‌లు రెండు దేశాల మ‌ధ్య అంత‌ర్యుద్దాన్ని వివ‌రంగా ఆవిష్క‌రించారు.

Advertisement
Advertisement