Trisha | ఆ స్థానం నుంచి త్రిష పోటీ..?
Trisha | ప్రముఖ నటి త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజీనామా తర్వాత తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి త్రిషను గెలిపించి ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 5, 2026, 2.50 pm IST
Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ (Actor Vijay) రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్.. రెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపొందారు. దీంతో ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తిరుచ్చి ఈస్ట్ (Trichy East) స్థానానికి రిజైన్ చేయాలని విజయ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా తర్వాత (TVK ticket) ఆ స్థానం నుంచి ప్రముఖ నటి, విజయ్ సన్నిహితురాలు త్రిష (Trisha) పోటీకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీవీకే ప్రభుత్వంలో త్రిష చక్రం తిప్పనున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చజరుగుతోంది.
త్రిషకు డిప్యూటీ సీఎం..?
త్రిషను ఉప ఎన్నిక బరిలోకి దింపాలని విజయ్ కూడా భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అక్కడి నుంచి త్రిషను గెలిపించి ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఊహించిన రీతిలో భారీ విజయం నమోదు చేసింది. ఏకంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు కొద్దిదూరంలోనే ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతుకోరే పనిలో పడ్డారు విజయ్.
Also Read..
మే 9న బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకారం : బీజేపీ
డీఎంకే ఓటమి.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
మోదీకి ఇక తిరుగులేదు.. టీవీకే దెబ్బకు డీఎంకే విలవిల.. ఎన్నికల ఫలితాలపై పాశ్చాత్య మీడియా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



