త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | 45 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి బీజేపీ ఎంపీ డిజాస్ట‌ర్‌ మూవీ

కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించిన భార‌త భాగ్య విధాత థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. న‌ల‌భై ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవ‌లం ఏడు కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. తాజాగా ఈ డిజాస్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆగ‌స్ట్ 14 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Aug 7, 2026, 4.48 pm IST

Kangana Ranaut | 45 కోట్ల బ‌డ్జెట్ – ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి బీజేపీ ఎంపీ డిజాస్ట‌ర్‌ మూవీ
Advertisement

Kangana Ranaut | బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ భార‌త భాగ్య విధాత డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 26 11 ముంబై ఎటాక్స్ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు 45 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఏడు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ ఏడాది బాలీవుడ్ అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ప్రొడ్యూస‌ర్‌గా....

స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు మ‌నోజ్ త‌పాడియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు కంగ‌నా ర‌నౌత్ ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. గిరిజా ఓక్‌, స్మితా తాంబే, స‌యాజీ షిండే కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

బ‌యోపిక్‌....

ముంబై ఎటాక్స్‌లో వంద‌లాది మంది ప్రాణాలు కాపాడిన అంజ‌లి కుల్తే అనే న‌ర్స్ జీవితం ఆధారంగా భార‌త భాత్య విధాత మూవీ రూపొందింది. కేవ‌లం 28 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. తొలుత ఈ టైటిల్‌ను బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హం రిజిస్ట‌ర్ చేసుకున్నారు. కానీ కంగ‌నా అడ‌గ‌టంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టైటిల్ ఇచ్చేశారు.

ఓటీటీలోకి....

భార‌త భాగ్య విధాత థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలో వ‌చ్చేస్తోంది. ఆగ‌స్ట్ 14 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ముంబైలోని కామా హాస్పిట‌ల్‌లో గీతా మాధ‌వ్ న‌ర్స్‌గా ప‌నిచేస్తుంది. వారి హాస్పిట‌ల్‌పై టెర్ర‌రిస్ట్‌లు ఎటాక్ చేస్తారు. ఈ ఎటాక్ బారి నుంచి రోగుల‌ను గీతా మాధ‌వ్‌తో క‌లిసి మిగిలిన న‌ర్సులు ఎలా కాపాడారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

త‌మిళంలో...

భార‌త భాగ్య విధాత త‌ర్వాత స‌ర్కిల్ పేరుతో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది. ఆర్ మాధ‌వ‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీకి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మిళం, తెలుగుతో పాటు హిందీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement