త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hansika Motwani | మరోసారి తెరపైకి హన్సిక విడాకుల వ్యవహారం – మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన క‌థ‌

టాలీవుడ్ హీరోయిన్ హ‌న్సిక విడాకుల వ్య‌వ‌హారం మ‌రోమారు తెర‌పైకి వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా భ‌ర్త నుంచి విడిపోతున్న‌ట్లుగా హింట్ ఇచ్చేసింది. ఇంత‌కీ హ‌న్సిక ఏం చేసిందంటే?

N

Entertainment | Published On Feb 3, 2026, 3.54 pm IST

Hansika Motwani | మరోసారి తెరపైకి హన్సిక విడాకుల వ్యవహారం  – మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన క‌థ‌
Advertisement

Hansika Motwani | టాలీవుడ్ హీరోయిన్ హ‌న్సిక భ‌ర్త నుంచి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ నుంచి భ‌ర్త‌తో దిగిన ఫొటోల‌తో పాటు పెళ్లి ఫొటోల‌ను డిలీట్‌ను చేయ‌డంతో మ‌రోసారి విడాకుల వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. 2022లో బిజినెస్‌మెన్ సోహైల్ ఖ‌తురియాను పెళ్లి చేసుకుంది హ‌న్సిక‌. పెళ్లికి ముందు ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారు. ఈఫిల్ ట‌వ‌ర్ ముందు సోహైల్ ఖ‌తురియా త‌న‌కు ప్ర‌పోజ్ చేసిన ఓ ఫొటోతో వెడ్డింగ్ న్యూస్‌ను అభిమానుల‌తో పంచుకుంది హ‌న్సిక‌. రాజ‌స్థాన్ జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్‌లో వైభ‌వంగా సోహైల్‌, హ‌న్సిక పెళ్లి జ‌రిగింది. హ‌న్సిక పెళ్లి వీడియో డాక్యుమెంట‌రీగా హ‌న్సిక ల‌వ్ షాదీ డ్రామా పేరుతో జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది.

అన్‌ఫాలో...

పెళ్లైన ఏడాదికే సోహైల్‌, హ‌న్సిక మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌లైన‌ట్లు స‌మాచారం. చాలా కాలంగా భ‌ర్త‌కు దూరంగా త‌ల్లితో క‌లిసి విడిగా ఉంటుంది హ‌న్సిక‌. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో స‌డెన్‌గా ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోల‌ను హ‌న్సిక డిలీట్ చేయ‌డంలో భ‌ర్త నుంచి ఆమె విడాకులు తీసుకోనుందంటూ రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. భ‌ర్త‌ను సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేయ‌డ‌మే కాకుండా త‌న పేరు కూడా మార్చుకుంది హ‌న్సిక‌. దాంతో విడాకులు వార్త‌లు నిజ‌మేనంటూ అంతా అనుకున్నారు.

అవన్నీ అబద్దాలే...

విడాకుల రూమ‌ర్లు అబ‌ద్ధ‌మంటూ సోహైల్ క్లారిటీ ఇచ్చాడు. హ‌న్సిక కూడా భ‌ర్త‌తో క్లోజ్‌గా ఉన్న‌ కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అ పుకార్ల‌కు చెక్‌ పెట్టింది. కొన్ని పెళ్లి ఫొటోల‌ను తిరిగి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. హ‌న్సిక‌, సోహైల్‌ మ‌ధ్య గొడ‌వ‌లు స‌మ‌సిపోయాన‌ని, మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసిపోయారంటూ ప్ర‌చారం జ‌రిగింది.
మంగ‌ళ‌వారం భ‌ర్త‌తో దిగిన ఫొటోల‌తో పాటు పెళ్లి ఫొటోలు ఒక్క‌టి కూడా లేకుండా ఇన్‌స్టాగ్రామ్ నుంచి మొత్తం డిలీట్ చేసింది హ‌న్సిక‌. హ‌న్సిక చేసిన ప‌నితో భ‌ర్త నుంచి ఆమె విడాకులు తీసుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని అంటున్నారు. వీరిద్ద‌రిని క‌ల‌ప‌డానికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ట‌.
కాగా దాంప‌త్య జీవితంలో క‌ల‌త‌ల కార‌ణంగా కొన్నాళ్లుగా సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన హ‌న్సిక మ‌ళ్లీ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌ట‌. సోమ‌వారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో స్లిమ్ లుక్‌లో అభిమానుల‌కు క‌నిపించింది. ఈ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

Advertisement
Advertisement