Hyundai | హ్యుందాయ్ కార్లకు భారీ రీకాల్.. అగ్ని ప్రమాద ముప్పు..
Hyundai | అమెరికాలో అగ్ని ప్రమాద ముప్పు కారణంగా 94,622 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. వాహనాలు పార్క్ చేసిన సమయంలో లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా ఆటోమొబైల్ భద్రతా నియంత్రణ సంస్థ వెల్లడించింది.
Automobiles | Published On Oct 17, 2026, 11.35 am IST
Hyundai | అమెరికాలో అగ్ని ప్రమాద ముప్పు కారణంగా 94,622 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. వాహనాలు పార్క్ చేసిన సమయంలో లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా ఆటోమొబైల్ భద్రతా నియంత్రణ సంస్థ వెల్లడించింది. హ్యుందాయ్ మోటార్ అమెరికా సంస్థకు చెందిన 94,622 వాహనాల్లో ముందు వైపు పవర్ సీట్లకు సంబంధించిన మోటార్లు అధికంగా వేడెక్కే అవకాశం ఉందని అమెరికా జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రతా పరిపాలనా సంస్థ (ఎన్హెచ్టీఎస్ఏ) తెలిపింది.
ఈ మోడళ్లకు రీకాల్..
పవర్ సీటును నియంత్రించే స్విచ్ ఒకే స్థితిలో ఇరుక్కుపోవడం వల్ల ముందు సీటు మోటార్లు అధికంగా వేడెక్కుతాయని అధికారులు వివరించారు. దీనివల్ల కారు పార్క్ చేసి ఉన్నా, నడుపుతున్నా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ రీకాల్ పరిధిలో 2015-2016 సంవత్సరాలకు చెందిన కొన్ని హ్యుందాయ్ జెనెసిస్ కార్లు, 2017-2020 మధ్య తయారైన జెనెసిస్ జీ80 మోడళ్లు ఉన్నాయి. వాహనాల యజమానులు మరమ్మత్తులు పూర్తయ్యే వరకు కార్లను బహిరంగ ప్రదేశాల్లో, ఇతర వాహనాలు లేదా భవనాలకు దూరంగా పార్క్ చేయాలని హ్యుందాయ్ సూచించినట్లు ఎన్హెచ్టీఎస్ఏ వెల్లడించింది. దీనివల్ల అగ్ని ప్రమాదం సంభవించినా ఇతర వాహనాలు, నిర్మాణాలకు ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మరమ్మత్తు విధానాన్ని హ్యుందాయ్ అభివృద్ధి చేస్తోందని ఆటోమొబైల్ భద్రతా నియంత్రణ సంస్థ తెలిపింది. రీకాల్కు గురైన వాహనాల్లో నిడెక్ మొబిలిటీ కొరియా కార్పొరేషన్ సరఫరా చేసిన ముందు పవర్ సీటు నియంత్రణ స్విచ్లు ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ అంశంపై వివరణ కోరగా నిడెక్ స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Bharat NCAP 2.0 | భారత్ ఎన్క్యాప్ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన
సెప్టెంబర్ 3, 2026

Hyundai Car Discounts | కార్లను కొనేవారికి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్లను ప్రకటించిన హ్యుందాయ్..
ఏప్రిల్ 6, 2026

Hyundai Palisade | ఎస్యూవీ అమ్మకాల నిలిపివేత.. 68వేలకుపైగా వాహనాల రీకాల్..!
మార్చి 15, 2026
తాజావార్తలు
- ●Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!
- ●Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా
- ●Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడుల జోరు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
- ●CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిరసన అట్టర్ ఫ్లాప్
- ●BS-VII | వాహనాలకు బీఎస్-7 నిబంధనలు.. కీలక మార్పులకు కేంద్రం కసరత్తు..

Door of Hell Turkmenistan | భూమిపై 'నరక ద్వారం' ఎక్కడుందో తెలుసా? 50 ఏళ్లుగా ఆరకుండా మండుతున్న ఈ మిస్టరీ వెనుక అసలు కథ ఇదే!

Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా

Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడుల జోరు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..



