Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. ఇప్పుడు టూవీలర్లలోనూ.. టాప్ 5 మోడల్స్ ఇవే..
Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ గురించి అందరికీ తెలిసిందే. సుదీర్ఘ హైవే ప్రయాణాల సమయంలో రోడ్డు ఎలాంటి వంపులు లేకుండా నేరుగా ఉంటే, కారులో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేస్తే వాహనం ఒక నిర్దిష్టమైన వేగం వద్ద డ్రైవర్ ప్రమేయం లేకుండానే ముందుకు సాగుతుంది.
Automobiles | Published On May 4, 2026, 11.40 am IST
Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ గురించి అందరికీ తెలిసిందే. సుదీర్ఘ హైవే ప్రయాణాల సమయంలో రోడ్డు ఎలాంటి వంపులు లేకుండా నేరుగా ఉంటే, కారులో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేస్తే వాహనం ఒక నిర్దిష్టమైన వేగం వద్ద డ్రైవర్ ప్రమేయం లేకుండానే ముందుకు సాగుతుంది. దీని వల్ల డ్రైవర్ కాస్త రిలాక్స్ అయ్యే వీలు ఉండడంతోపాటు యాక్సిలేటర్‌ను తొక్కిపట్టి ఉంచాల్సిన పనిలేదు. అయితే ఈ ఫీచర్ ప్రీమియం మోటార్ సైకిళ్లలోనూ అందుబాటులో ఉండగా, దీన్ని ఇప్పుడు పలు తయారీ కంపెనీలు సాధారణ టూవీలర్ మోడల్స్‌లోనూ అందిస్తున్నాయి. దీని వల్ల రైడర్లకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. సుదీర్ఘ ప్రయాణాల్లో హైవేలపై క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ద్విచక్ర వాహనదారులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లలో ఈ ఫీచర్ కలిగిన పలు సాధారణ, చవకైన టూవీలర్లు ప్రస్తుతం వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి.
హీరో గ్లామర్ ఎక్స్ అత్యంత చవక..
హీరో గ్లామర్ ఎక్స్ ఈ విభాగంలో మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లో క్రూయిజ్ కంట్రోల్ అందించిన తొలి బైక్‌గా ఇది నిలిచింది. దీని ధర రూ. 86,567 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ డిస్క్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది, దీని ధర రూ. 95,786 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న అత్యంత చవకైన బైక్‌గా గుర్తింపు పొందింది. ఇక తర్వాత హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ నిలిచింది. ఇది 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 11.5 హెచ్‌పీ పవర్, 10.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ బైక్‌లో టాప్ వేరియంట్ అయిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మోడల్‌లో క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
టీవీఎస్ కంపెనీ అయితే..
మూడో స్థానంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి నిలిచింది. ఇది 163.2 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్, 4 వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 17 హెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎం టార్క్ ను ఇస్తుంది. ఈ మోడల్‌లో ఈటీబీ వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ లభిస్తోంది. దీని ధర రూ. 1,36,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. నాలుగో స్థానంలో టీవీఎస్ అపాచి ఆర్టీఎక్స్ 300 నిలిచింది. ఈ బైక్ అన్ని వేరియంట్‌లలో కూడా క్రూయిజ్ కంట్రోల్ స్టాండర్డ్‌గా వస్తోంది. ఇది 299 సీసీ లిక్విడ్-ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఆర్టీ-ఎక్స్‌డీ4 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 35.5 హెచ్‌పీ పవర్ (9,000 ఆర్పీఎం వద్ద), 28.5 ఎన్ఎం టార్క్ (7,000 ఆర్పీఎం వద్ద) ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.
అపాచి ఆర్టీఆర్ 310..
ఇక ఐదో స్థానంలో టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ 310 ఉంది. ఇది రూ. 2.24 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ బైక్ 312.12 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 35 హెచ్‌పీ పవర్ (9,700 ఆర్పీఎం వద్ద), 28.7 ఎన్ఎం టార్క్ (6,650 ఆర్పీఎం వద్ద) ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు లగ్జరీ ఫీచర్‌గా ఉన్న క్రూయిజ్ కంట్రోల్ ఇప్పుడు బడ్జెట్ బైక్‌లలో కూడా అందుబాటులోకి రావడం రైడర్లకు పెద్ద ప్రయోజనంగా మారింది. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ చేసే వారికి ఇది సౌకర్యం, స్థిరత్వం అందిస్తుంది. తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లను కోరుకునే వారికి ఈ బైక్‌లు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






