త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OpenAI | చాట్‌జీపీటీలో కొత్త ఫీచ‌ర్‌.. ఇక జ‌న‌రేట్ చేసిన టెక్ట్స్‌ను కూడా గుర్తించొచ్చు..

OpenAI | యురోపియన్ యూనియన్ ఏఐ చట్టానికి అనుగుణంగా ఓపెన్‌ఏఐ తన ఏఐతో రూపొందించిన టెక్స్ట్‌ను గుర్తించే విధానాన్ని ప్రకటించింది. ఇందుకోసం టెక్స్ట్‌గ్రెయిన్ అనే టెక్స్ట్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇది టెక్స్ట్‌లో కనిపించని గణాంక సంకేతాన్ని జోడిస్తుంది. అయితే ఇది ఏఐ టెక్స్ట్‌ను 100 శాతం కచ్చితంగా గుర్తించే విధానం కాదు.

S

Technology | Published On Oct 6, 2026, 3.50 pm IST

OpenAI | చాట్‌జీపీటీలో కొత్త ఫీచ‌ర్‌.. ఇక జ‌న‌రేట్ చేసిన టెక్ట్స్‌ను కూడా గుర్తించొచ్చు..
Advertisement

OpenAI | యురోపియన్ యూనియన్ ఏఐ చట్టానికి అనుగుణంగా ఓపెన్‌ఏఐ తన ఏఐతో రూపొందించిన టెక్స్ట్‌ను గుర్తించే విధానాన్ని ప్రకటించింది. ఇందుకోసం టెక్స్ట్‌గ్రెయిన్ అనే టెక్స్ట్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇది టెక్స్ట్‌లో కనిపించని గణాంక సంకేతాన్ని జోడిస్తుంది. అయితే ఇది ఏఐ టెక్స్ట్‌ను 100 శాతం కచ్చితంగా గుర్తించే విధానం కాదు. టెక్స్ట్ పొడవు, అంశం, ఎడిటింగ్, అనువాదం వంటి అంశాల వల్ల గుర్తింపు సామర్థ్యం మారుతుంది. ఉదాహరణకు 400 టోకెన్ల టెక్స్ట్‌లో 10 శాతం పదాలను మార్చితే గుర్తింపు రేటు సుమారు 92 శాతం నుంచి 66 శాతానికి పడిపోయింది. 25 శాతం పదాలను మార్చితే అది కేవలం 17 శాతానికి తగ్గింది. టెక్స్ట్‌గ్రెయిన్‌కు ప్రత్యేకమైన రహస్య కీ ఆధారంగా గణాంక సంకేతం ఉంటుంది. డిటెక్టర్‌కు ఆ టెక్స్ట్‌ను రూపొందించిన మోడల్, వినియోగించిన ప్రాంప్ట్ లేదా యూజర్ వివరాలు అవసరం లేదు. వాటర్‌మార్క్ కనిపించకపోవడం కూడా ఆ టెక్స్ట్ మనిషి రాసిందేనని నిర్ధారించదు.

ల‌భ్య‌త ఎందులో..

ఓపెన్‌ఏఐ స్పష్టం చేసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, వాటర్‌మార్క్ ద్వారా టెక్స్ట్‌లో ఏఐ పాత్ర ఉందని మాత్రమే అంచనా వేయగలరు. దాన్ని ఎవరు రాశారు, ఎంతవరకు మనిషి ఎడిట్ చేశారు, యాజమాన్యం ఎవరిది, సమాచారం నిజమా కాదా వంటి విషయాలను వాటర్‌మార్క్ నిర్ధారించదు. యూరోపియన్ యూనియన్‌లోని అర్హత కలిగిన చాట్‌జీపీటీ, కోడెక్స్ వినియోగదారులకు రాబోయే వారాల్లో టెక్స్ట్ వాటర్‌మార్కింగ్ అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఏపీఐ వినియోగదారులు ఎంపిక చేసిన మోడళ్లలో దీన్ని స్వచ్ఛందంగా ప్రారంభించుకోవచ్చు. ప్రారంభంలో వాటర్‌మార్క్ డిటెక్టర్‌ను అందరికీ కాకుండా ఎంపిక చేసిన పరిశోధకులు, నిపుణ‌ సంస్థలకు మాత్రమే అందించనున్నారు.

ఓపెన్‌ఏఐ భవిష్యత్తులో టెక్స్ట్‌గ్రెయిన్‌ను ఓపెన్‌సోర్స్‌గా అందించాలని కూడా యోచిస్తోంది. టెక్స్ట్‌ను సులభంగా మార్చడం, అనువదించడం సాధ్యమవడం వల్ల టెక్స్ట్ వాటర్‌మార్కింగ్‌కు పరిమితులు ఉన్నాయని, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ తమ విధానాన్ని మార్చుకుంటామని సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement