Supreme Court | టీమిండియాను అలా పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని పిల్.. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
Supreme Court | భారత క్రికెట్ జట్టును 'టీమిండియా' అని పిలువకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దంటూ మొట్టికాయలు వేసింది.
Supreme Court | భారత క్రికెట్ జట్టును 'టీమిండియా' అని పిలువకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దంటూ మొట్టికాయలు వేసింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయవాది రీపక్ కన్సల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థగా పేర్కొన్న ఆయన.. టీమిండియా, భారత జాతీయ జట్టుగా పిలువడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.
ఆయా పేర్లు ఉపయోగించుకునేందుకు కేందం నుంచి అనుమతి లేదని, దాంతో ప్రసారభారతి, ఆలిండియా రేడియో సహా తదితర సంస్థలను భారత క్రికెట్ జట్టును టీమిండియా, జాతీయ జట్టుగా పిలువకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. కోర్టు పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఇంట్లో కూర్చొని ఇలాంటి పిటిషన్లు వేస్తారని.. ఆ పేర్లతో మీకు ఏం సమస్య అంటూ తీవ్రంగా స్పందించింది. క్రికెట్ జట్టు ప్రపంచ వ్యాప్తంగా ఆడుతోంది కదా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. పిటిషన్‌లో ఎలాంటి అర్థం లేదని.. దాంతో కోర్టు సమయం వృథా అవుతోందని తెలిపింది. గతంలో ఇదే పిటిషన్ ఢిల్లీ హైకోర్టులోనూ విషయం తెలిసిందే. హైకోర్టు సైతం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సమయంలోనూ సమయం వృథా అంటూ ఆగ్రహించింది. ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం సమర్థించింది.
సంబంధిత వార్తలు

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
అక్టోబర్ 2, 2026

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
అక్టోబర్ 2, 2026

Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!



