Gemini AI In Cars | ఇక కార్లలోనూ జెమిని ఏఐ.. మరింత సులభతరం కానున్న ప్రయాణం..
Gemini AI In Cars | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అనేక రంగాల్లో ఇప్పటికే ఏఐ తన ప్రభావాన్ని చూపిస్తోంది. అది, ఇది అని లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ ముద్ర బలంగా కనిపిస్తోంది.
Technology | Published On May 1, 2026, 5.18 pm IST
Gemini AI In Cars | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అనేక రంగాల్లో ఇప్పటికే ఏఐ తన ప్రభావాన్ని చూపిస్తోంది. అది, ఇది అని లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ ముద్ర బలంగా కనిపిస్తోంది. ఏఐ రంగంలో అనేక ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే సేవలు అందిస్తున్నప్పటికీ ముందు నుంచీ గూగుల్ అసిస్టెంట్‌గా ఉన్న ఏఐ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు జెమిని గా మారి యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే గూగుల్ జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అనేక సంస్థలు వాడుతుండగా, త్వరలోనే కార్లలోనూ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కార్లలో చాలా వరకు సంప్రదాయ గూగుల్ అసిస్టెంట్‌నే ఇప్పటికీ వాడుతున్నారు. ఇది ఒక రకమైన చాట్ బాట్ అయినప్పటికీ జెమిని అంత సమర్థవంతంగా పనిచేయదు. అందువల్ల గూగుల్ ఇకపై కార్లలోని అసిస్టెంట్ ను తీసేసి బదులుగా జెమినిని ప్రవేశపెట్టనుంది. దీంతో వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
గూగుల్ అసిస్టెంట్ స్థానంలో..
కార్లలో అందుబాటులో ఉన్న గూగుల్ అసిస్టెంట్ స్థానంలో ఇపై గూగుల్ జెమినిని ఏర్పాటు చేస్తారు. దీనికి గాను గూగుల్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను అంతర్గతంగా టెస్ట్ చేస్తోంది. చిన్న సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడ్ చేస్తే చాలు, పాత తరం కార్లకు కూడా జెమిని సేవలను అందించవచ్చు. దీంతో వినియోగదారులు వాయిస్ కమాండ్లు, సహజమైన చాట్‌లతోనే కారులో జెమినితో పనులు చేయించుకోవచ్చు. జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌ను కారుకు అనుసంధానించడం వల్ల వాహనదారుడు తన సహజ భాషలోనే సంభాషణ చేయవచ్చు. అలాగే కార్ డిజిటల్ సిస్టమ్‌లో ఉండే యాప్ లను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా కొత్త ఆలోచన వస్తే దాన్ని జెమినికి షేర్ చేయవచ్చు. దీంతో తరువాత ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా జెమిని అందిస్తుంది. ప్రయాణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే జెమిని అందించే సహాయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
హ్యాండ్స్ ఫ్రీ విధానంలో సంభాషణలు..
కార్‌లో అందుబాటులో ఉండే జెమిని ప్లాట్‌ఫామ్‌తో వాహనదారులు హ్యాండ్స్ ఫ్రీ విధానంలో సంభాషణలు జరపవచ్చు. దీంతో డ్రైవింగ్‌లో ఆటంకం లేకుండా ఉంటుంది. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు దారిలో ఎక్కడైనా భోజనం చేయాల్సి వస్తే ఆ మార్గంలో ఉండే రెస్టారెంట్ల వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌లో ఉంటుంది. కానీ ఆ వివరాలను మాన్యువల్‌గా తెలుసుకోవాలి. అదే జెమిని ఉంటే మాన్యువల్‌గా వెదకాల్సిన పని ఉండదు. ఇక రహదారిలో ముందు ఏదైనా ట్రాఫిక్ అంతరాయం ఉన్నా కూడా జెమిని ముందుగానే చెప్పేస్తుంది. దీంతో వాహనదారులు మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లవచ్చు. అలాగే కార్ డిజిటల్ సిస్టమ్‌లో ఉండే మ్యూజిక్ యాప్స్‌తో కనెక్ట్ అయి వాహనదారులు ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయమని జెమినిని అడగవచ్చు. ఇలా జెమిని ఏఐ కార్లలో ఎన్నో సౌకర్యాలను అందిస్తుంది.
కార్లలో గూగుల్ అందించనున్న ఈ జెమిని ఏఐ ఫీచర్ అప్‌డేట్ ముందుగా అమెరికాలో వాహనదారులకు ఇంగ్లిష్ భాషలో లభ్యం కానుంది. తరువాత దశలవారీగా ప్రపంచంలోని ఇతర దేశాల యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తామని గూగుల్ తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?
- ●CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం
- ●DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
- ●KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా
- ●TTD | హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి
- ●Dodla Dairy | దొడ్ల డెయిరీ పాలు నాసిరకం.. కంపెనీపై ప్రాసిక్యూషన్ ఆర్డర్










