Srisailam | భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలం వచ్చే వాహనాలకు టోల్ మినహాయింపు
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ముక్కంటి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
Srisailam | త్రినేత్ర.న్యూస్: మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ముక్కంటి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం (ఫిబ్రవరి 13) నుంచి 16 వరకు దేవస్థానం (Toll gate Fee), అటవీశాఖ టోల్‌గేట్ల (నంద్యాల మార్గంలో) వద్ద ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రాత్రివేళల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2,59,050 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ తెలిపారు. మహా శివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






