Student | తృటిలో తప్పించుకున్నాడు.. మృత్యువు అంచుల్లోకి వెళ్లి వచ్చిన స్టూడెంట్.. వీడియో
Student | అదృష్టం అంటే అతనిదే. మృత్యువు అంచుల్లోకి వెళ్లి క్షేమంగా బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న ఓ విద్యార్థి (Student) అనుకోకుండా కిందపడి పోయాడు. ఎదురుగా బస్సు (School Bus) వస్తున్నది. అబ్బా చచ్చాడ్రా..! అని అనుకునే లోపే లేచి నిలబడ్డాడు.
Student | త్రినేత్ర.న్యూస్: అదృష్టం అంటే అతనిదే. మృత్యువు అంచుల్లోకి వెళ్లి క్షేమంగా బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న ఓ విద్యార్థి (Student) అనుకోకుండా కిందపడి పోయాడు. ఎదురుగా బస్సు (School Bus) వస్తున్నది. అబ్బా చచ్చాడ్రా..! అని అనుకునే లోపే లేచి నిలబడ్డాడు. కొద్దిలో అతని తలపైనుంచి బస్సు వెనక టైర్ వెళ్తుండే. అయితే డ్రైవర్ అప్రమత్తతో తృటిలో పెను ప్రమాదం (Narrowly Escape) తప్పింది.. ఆ యువకుడి ప్రాణం నిలిచింది. ఈ ఘటన కేరళలోని మళప్పురం (Malappuram) జిల్లాలో జరిగింది.
శనివారం ఉదయం ఓ విద్యార్థి బైక్‌పై వెళ్తున్నాడు. ఇరుకుగా ఉన్న ఆ రోడ్డులో బైక్‌పై అదుపుతప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. రోడ్డుపై జారుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఓ స్కూల్ బస్సు వెళ్తున్నది. అయితే యువకుడిని గమనించిన డ్రైవర్ బస్సును ఎడమవైపు తీసుకెళ్లాడు. దీంతో బస్సు వెనకటైర్ అతని తలకు ఇంచు దూరం నుంచి వెళ్లింది. ఒక్క ఉదుటున లేచిన ఆ స్టూడెంట్ చావు తప్పిందిరా నాయన అనుకున్నాడు!. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.
అయితే ఇదంతా చూస్తున్న ఓ యువకుడు పరుగున ఆ విద్యార్థి దగ్గరకు వెళ్లాడు. అతడు లేచి నిలబడటంతో ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం బాధితుడిని దవాఖానకు తరలించారు. స్వల్ప గాయాలే అయ్యాయని, అతడు క్షేమంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదయింది. ప్రస్తుతం ఈ దృష్యాలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ 'మృత్యుంజయుడిని' దేవుడే రక్షించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/anilp68/status/2020107571059904574
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






