త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIC లో సైంటిస్ట్-బీ పోస్టులు.. గేట్ స్కోర్‌తో కొట్టేయండి.. చివ‌రి తేదీ ఏప్రిల్ 24

NIC | నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్( National Informatics Centre ) కూడా గేట్( GATE ) మెరిట్ స్కోర్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు 243 సైంటిస్ట్ -బీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. నోటిఫికేష‌న్ వివ‌రాలు తెలుసుకుందాం.

S

National | Published On Apr 12, 2026, 8.31 am IST

NIC లో సైంటిస్ట్-బీ పోస్టులు.. గేట్ స్కోర్‌తో కొట్టేయండి.. చివ‌రి తేదీ ఏప్రిల్ 24
Advertisement

NIC | త్రినేత్ర‌.న్యూస్ : ఇంజినీరింగ్ చేసిన ప్ర‌తి విద్యార్థి గేట్( GATE ) త‌ప్ప‌కుండా రాస్తారు. ఈ గేట్‌లో మెరిట్ స్కోర్ సాధించిన వారు సులువుగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను( Govt Jobs ) సాధించొచ్చు. ఎలా అంటే చాలా కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో గేట్ స్కోర్ ఆధారంగానే ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. అయితే నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్( National Informatics Centre ) కూడా గేట్ మెరిట్ స్కోర్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు 243 సైంటిస్ట్ -బీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. నోటిఫికేష‌న్ వివ‌రాలు తెలుసుకుందాం.

మొత్తం ఉద్యోగాలు - 243

అన్ రిజ‌ర్వ్‌డ్ - 105
ఈడ‌బ్ల్యూఎస్ - 23
ఓబీసీ - ఎన్‌సీఎల్ - 64
ఎస్సీ - 35
ఎస్టీ - 16

అర్హ‌త‌లు :

ఎన్ఐసీ సైంటిస్ట్ - బీ పోస్టుల‌కు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ డేటా సైన్స్‌ అండ్‌ ఏఐతో బీఈ/ బీటెక్‌. గేట్ స్కోర్ త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక :

గేట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. గేట్‌-2024/ 2025/ 2026 స్కోరుకు 60 శాతం, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో అన్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులు 50 శాతం, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 40 శాతం కనీసార్హత మార్కులు పొందాలి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ ఇంటర్వ్యూ సమయంలోనే ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

వయసు :

31.03.2026 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

అన్‌రిజర్వుడ్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు ఫీజు ఉండదు.

వేతన శ్రేణి:

నెలకు రూ.56,100 - 1,77,500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2026

వెబ్‌సైట్‌: https://recruitment.nic.in/

Advertisement

తాజావార్తలు

Advertisement