Plucking Guavas | జామ కాయలు తెంపిందని.. చిన్నారిని గొలుసుతో కట్టేసి కొట్టిన మాజీ సైనికుడు
Plucking Guavas | హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. అడగకుండా జామ కాయలు తెంపిందని మైనర్ బాలికను మాజీ సైనికుడు గొలుసుతో కట్టేసి, విచక్షణా రహితంగా కొట్టాడు.
Plucking Guavas | త్రినేత్ర.న్యూస్: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. అడగకుండా జామ కాయలు తెంపిందని మైనర్ బాలికను మాజీ సైనికుడు గొలుసుతో కట్టేసి, విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వలస కుటుంబానికి చెందిన మైనర్ బాలిక.. మాజీ సైనికుడి ఇంటి బయట ఉన్న జామ చెట్టుకు కాయలను అనుమతి లేకుండా తెంపింది. ఈ సందర్భంగా ఆమెను పట్టుకున్న మాజీ సైనికుడు ఆమెను మెట్లకు ఉన్న గ్రిల్స్‌కు ఇనుమ గొలుసుతో కట్టేశాడు. అనంతరం ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడు. అయితే అదే ఇంట్లో పనిచేస్తున్న ఓ యువకుడు దీనినంతా తన ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను విడిపించారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు నమోదుచేశారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, జరిగిన ఘటన పట్ల మాజీ సైనికుడు పశ్చాతాపం వ్యక్తంచేశాడు. బాలికకు క్షమాపణ చెప్పాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






